యువరాజు కష్టాలు..రాహుల్ పై బూటు విసిరిన యువకుడు..!

Monday, September 26th, 2016, 05:55:50 PM IST

rahul-gandhi
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. ఉత్తర ప్రదేశ్ లో అందరికంటే ముందే ఎన్నికల ప్రచారం ప్రారంభించిన రాహుల్ గాంధీ కి సీతాపూర్ లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ స్థానిక యువకుడు రాహుల్ పై బూటు విసిరాడు.అయితే వేగంగా స్పందించింన రాహుల్ తప్పించుకోవడంతో బూటు తగల్లేదు.అక్కడ వున్న కార్యకర్తలు బూటు విసిరినా వ్యక్తిని గమనించడంతో అతడిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు.

పోలీస్ లు వెంటనే స్పందించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై రాహుల్ గాంధీ స్పందించారు.తాను దాడులకు భయపడబోనని రాహుల్ గాంధీ అన్నారు.”బిజెపి, ఆర్ ఎస్ ఎస్ లకు ఒక్కటే చెప్పదలుచుకున్నా. నా పై చెప్పులు వేయాలనుకుంటే వేయండి.నేను మీకు భయపడను” అంటూ బిజెపి, ఆర్ ఎస్ ఎస్ లపై విరుచుకుపడ్డారు.