స్నానం చేస్తుంటే ఆయనకు బాత్రూంలోకి తొంగి చూసే అలవాటుంది..!!

Saturday, February 11th, 2017, 12:50:42 PM IST


త్వరలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ నేతలు ఒకరిపై మరొకరు ప్రత్యక్ష దూషణలకు దిగుతున్నారు. పార్లమెంట్ లో ప్రధాని నరేంద్రమోడీ..మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై చేసిన విమర్శలకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తోంది. మన్మోహన్ సింగ్ బాత్రూంలో రైన్ కోటు వేసుకుని స్నానం చేస్తారని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు.

ప్రధాని మోడీకి జనాలు స్నానాలు చేస్తుంటే బాత్రూంలోకి తొంగి చూస్తారని ఘాటుగా వ్యాఖ్యానించారు. లక్నోలో రాహుల్ గాంధీ యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తో కలసి కామన్ మినిమం ప్రోగ్రాం పేరిట జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మోడీ పై వ్యాఖ్యలు చేసారు. ఎవరైనా ప్రశ్నించినపుడు సమాధానం చెప్పలేకపోతే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మోడీకి అలవాటని రాహుల్ ఎద్దేవా చేశారు. మోడీకి ఉన్నది ఇక రెండున్నరేళ్లు మాత్రమే అని ఆయన జాతకం బయట పెట్టాలని రాహుల్ అన్నారు. అఖిలేష్ కూడా మోడీపై పరోక్ష విమర్శలు చేశారు. కొంతమంది మన్ కీ బాత్ చెబుతున్నారు కానీ కామ్ కి బాత్ చెప్పడం లేదని అన్నారు.