ఇద్దరు మహానాయకులను అప్రతిష్టపాలు చేస్తున్నారు – మోడీపై రాహుల్ ఫైర్..!

Wednesday, December 5th, 2018, 08:00:45 PM IST

గాంధీ, పటేల్ లాంటి నాయకులను తన స్వప్రయోజనాల కోసం మోడీ అప్రతిష్టపాలు చేస్తున్నాడంటూ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో కాంగ్రెస్ నాయకులు చొరవ చూపకపోవటం వల్లనే కర్త్తర్ పూర్ పాకిస్తాన్ పరమైందని, వారు సిక్కుల మనోభావాలను పట్టించుకోలేదని మోడీ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఫేస్‌బుక్‌ పోస్ట్ ద్వారా ఆయన బుధవారం మోదీ మీద మండిపడ్డారు. ‘ప్రధాని మోదీ ఆలోచన ఏంటో బయటపడింది. తనని అందరికంటే ఉన్నతంగా చూపించుకోవడానికి, గాంధీ, పటేల్, ఇతర నాయకులను అప్రతిష్ఠపాలు చేయగలరు’ అని రాహుల్‌ గాంధీ విమర్శించారు.

కొద్దిరోజుల క్రితం కర్త్తర్ పూర్ నడవాను ప్రారంభించిన సందర్భంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేసారు, సిక్కు మత గురువు గురునానక్‌ చివరి రోజులు గడిపిన పాకిస్థాన్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌ ను దర్శించుకోవడానికి ఈ నడవా సిక్కు యాత్రికులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. కాంగ్రెస్ చేసిన పొరపాట్లను సరిదిద్దటం తన విధి అని మోడీ మంగళవారం రాజస్థాన్ లో జరిగిన ఎన్నికల సమావేశంలో అన్నారు.