ట్వీట్ తెచ్చిన తంట.. 10 రోజుల్లో రాహుల్ సమాధానం చెప్పాలి!

Thursday, June 21st, 2018, 03:20:18 AM IST

ఇటీవల మంచి కోసం పోరాడినా కూడా ఆ విషయంలో కాస్త పొరపాటు ఉన్న తీరిగి ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. సోషల్ మీడియాలో స్పందిస్తున్న తీరులో ఏ మాత్రం తేడా వచ్చిన ఇబ్బందులు తప్పవని ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ నిరూపించింది. గత కొన్ని రోజుల క్రితం రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన ఒక వీడియో వల్ల బాలల హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. 10 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులు కూడా పంపించారు.

అసలు వివరాల్లోకి వెళితే.. దళిత బాలలు బావిలో స్నానం చేశారని అగ్ర కులస్తుతులు కొందరు వారిని నగ్నంగా ఊరేగించి కొట్టడం మహారాష్ట్రలో సంచలనం సృష్టించింది. జలగావ్ జిల్లా వకడి అనే గ్రామంలో జరిగిన ఆ అవమానకర ఘటనకు రాహుల్ స్పందిస్తూ.. దళిత పిల్లలు చేసిన తప్పు బావిలో స్నానం చేయడమే.. మానవజాతి గౌరవాన్ని కాపాడుకోవడానికి పోరాడుతోంది. బీజేపీ – ఆరెస్సెస్ విద్వేషపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం వచ్చిందని.. లేకుంటే చరిత్ర క్షమించదని చెప్పారు. దీంతో ముంబయికి చెందిన ఓ వ్యక్తి మైనర్‌ బాలలు అని తెలిసి కుడా వారి గుర్తింపును అందరికి తెలిసేలా బయట పెట్టడం నేరమని బాలల హక్కుల సంఘానికి పిర్యాదు చేయగా వారు రాహుల్ కి నోటీసులు అందించారు.