కాంగ్రెస్ దెబ్బకు దెబ్బ.. రాహుల్ ప్రయోగాలు సక్సెస్ అవుతాయా?

Sunday, April 15th, 2018, 09:26:19 AM IST

కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎంత పెద్ద పార్టీనో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితేచాలా కాలంగా ఆ పార్టీలో మార్పులు రావడంతో ఎన్నికల రిజల్ట్ లో కూడా చాలా తేడాలు వచ్చాయి. సీనియర్ రాజకీయ నాయకులు చేసిన పొరపట్ల వల్లే గెలుచుకున్న స్థానాలను కూడా బీజేపీ ధాటికి వదులుకోవాల్సి వచ్చింది. బీజేపీ సమయాన్ని బట్టి కాంగ్రెస్ న దెబ్బ కొట్టింది. అయితే రీసెంట్ గా పార్టీ బాధ్యతలను పూర్తిగా అధిష్టానం యువ నేత రాహుల్ గాంధీకి అప్పగించారు. అతన్ని ప్రధాని చేయాలనీ తల్లి సోనియా గాంధీ ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు. అయితే రాహుల్ ఎన్ని ప్రచారాలను నిర్వహిస్తోన్న కూడా అందుకు తగ్గట్టు రిజల్ట్ రావడం లేదు.

పోటీని అయితే చూపిస్తున్నాడు గాని అనుకున్నంతగా ప్రభావం చూపలేకపోతున్నాడు. దీంతో మోడీ పార్టీని దేశవ్యాప్తంగా గెలిపించే దిశగా ప్రణాలికలతో ముందుకు సాగుతున్నాడు. కానీ ప్రస్తుత పరిస్థితులు మోడీ పార్టీని దెబ్బ కొట్టే విధంగా కనిపిస్తున్నాయి. అప్పట్లో కాంగ్రెస్ పొరపాట్లను ఎలా వాడుకున్నరో ఇప్పుడు బీజేపీ పొరపాట్లను కాంగ్రెస్ వాడుకోవడానికి సిద్ధమైంది. అయితే రాహుల్ అందులో ఎంత వరకు విజయాన్ని అందుకుంటాడు అనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ పార్టీని బలోపేతం చేయడానికి ఇదే మంచి అవకాశమని కాంగ్రెస్ పెద్దలు సలహాలు ఇచ్చేస్తున్నారు. అధికారం కాంగ్రెస్ పార్టీకి దక్కితే రాహుల్ ప్రధాని అవుతాడని సోనియా ముందు ఫిక్స్ చేశారు. మరి ఈ సమయంలో రాహుల్ ఎంతవరకు తన ప్రయత్నాలను సక్సెస్ అయ్యేలా చేస్తాడో చూడాలి.