రాహుల్ ఏం చేస్తాడో ఏమో?

Thursday, June 14th, 2018, 03:15:39 AM IST


జాతీయ కాంగ్రెస్ చాలా కాలంగా ఎదుర్కొంటున్న అపజయాలను చూసి ఎంతో కొంత అవగాహనా పెంచుకుంటుందని అనుకున్నా చివరికి మళ్లీ అదే తరహాలో ప్లాన్స్ వేస్తోంది. బీజేపీకి పోటీ ఇవ్వలేక ఆ పార్టీకి అధికారం దక్కకూడదని మరో పార్టీతో చేతులు కలపడానికి సిద్దమయ్యింది. అసలు ఇలాంటి పరిస్థితి వస్తుంది ఊహించలేదు. ప్రచారంలో రాహుల్ ప్లాన్స్ పెద్దగా వర్కౌట్ కాలేదు. మోడీ మంత్రం ముందు రాహుల్ గాంధీ సోనియా గాంధీ చిట్కాలు ఎంత మాత్రం సక్సెస్ కాలేదు.

ఇంతకుముందు జరిగిన ఎన్నికల్లోనే రాహుల్ లోపాలు స్పష్టంగా కనిపించాయి. ఎక్కువగా అవతల పార్టీ ఏం చేసింది అనే విషయల గురించే గాని మా పార్టీ పాలనా పని చేసింది ఇంకా చేస్తుంది అనేది కరెక్ట్ గా చెప్పలేదు. పాజిటివ్ ఆలోచన విషయాన్ని ప్రజలకు ఎక్కించలేకపోయారు. ప్రతి ఎన్నికల్లో రాహుల్ ప్రణాళికలు లోపం స్పష్టంగా కనిపించింది. ఆయన ఎప్పుడు సరైన ప్లాన్స్ తో పార్టీని నడిపించలేదని పార్టీ నేతలే విమర్శలు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది.

మరో వైపు అధ్యక్షురాలు సోనియా గాంధీ కొడుకుని ప్రధాని చెయ్యాలని అనుకుంటున్నారు. అందుకు గాను ముందే పార్టీ బాధ్యతలను పూర్తిగా అప్పగ్గించేశారు. కానీ రాహుల్ ఇప్పుడు సొంత కూటమిలో ఉన్న వారిని కూడా ఆకట్టుకోలేకపోతున్నారు. ఎన్టీయే కూటమి మరో వైపు చీలుతున్న సమయంలో ఆ వ్యతిరేక పార్టీలను కలుపుకోవడంలో రాహుల్ విఫలమవుతున్నారు. ఇక మరోవైపు థర్డ్ ఫ్రంట్ టాక్ గట్టిగా వస్తోంది. ఈ సమయంలో కాంగ్రెస్ పుంజుకోకపోతే వచ్చే ఎన్నికల్లో అధికారం మిస్ అవ్వడం కాయం. మరి రాహుల్ ఎలా ముందుకు వెళతారో చూడాలలి.

  •  
  •  
  •  
  •  

Comments