కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొదటి సంతకం హోదాకే నమ్మొచ్చా.?

Monday, October 1st, 2018, 04:37:58 PM IST

తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపధ్యంలో టీకాంగ్రెస్ పార్టీ వారు వారి యొక్క ముందస్తు మ్యానిఫెస్టోను ఈ రోజు విడుదల చేశారు.దీనిపై కాంగ్రెస్ ముఖ్య నేత రఘు వీరా రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలోని రాహుల్ గాంధీ గారు గాని అధికారంలోకి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ కు విభజన హామీల నిమిత్తం రావాల్సిన అన్ని హామీలను నెరవేరుస్తారని,ఆయన మొట్ట మొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదాకే పెడతారని తెలిపారు.

అంతే కాకుండా ఆయన రెండవ సంతకంగా దేశంలో ఉన్నటువంటి రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని,పెట్రోలు డీసెలు ధరలను ప్రజల కోరిక మేరకు జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తామని తెలిపారు.ఇప్పుడు ప్రత్యేక హోదా అంశం అనే దానికోసం మాట్లాడుకున్నట్టుఅయితే ఇంతకు ముందు బీజేపీ ప్రభుత్వం వారు కూడా ఇదే తరహాలో మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని ఆ మాటను దాటవేసిన సంగతి తెలిసినదే ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఇదే తరహా మాట్లాడ్డం వల్ల ఆంధ్ర ప్రజలు ఎవరిని నమ్మాలో నమ్మకూడదో తెలీడం లేదు.