ప్రధాని అవ్వాలని రాహుల్ ప్రయోగాలు !

Saturday, February 17th, 2018, 09:29:10 AM IST

జాతీయ కాంగ్రెస్ పార్టీ అంటే ఒకప్పుడు దేశంలో ఎంత పెద్ద పార్టీగా ఉండేదో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. అయితే గత కొంత కాలంగా పార్టీ రూపు రేఖలు మారడంతో ఎన్నికల రిజల్ట్ లో కూడా చాలా తేడాలు వచ్చాయి. సీనియర్ నాయకులు చేసిన పొరపట్ల వల్లే బలంగా ఉన్న స్థానాలను కూడా బీజేపీ ధాటికి వదులుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ పొరపట్లను బీజేపీ సమయాన్ని బట్టి వాడుకొని దెబ్బ కొట్టింది. అయితే ఇటీవల పార్టీ బాధ్యతలను పూర్తిగా అధిష్టానం పెద్దలు రాహుల్ గాంధీకి అప్పగించారు. అతన్ని ప్రధాని చేయడమే సోనియా గాంధీ లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే రాహుల్ ఎన్ని ప్రచారాలను నిర్వహిస్తోన్న కూడా అందుకు తగ్గట్టు రిజల్ట్ రావడం లేదు. పోటీని అయితే చూపిస్తున్నాడు గాని అనుకున్నంతగా ప్రభావం చూపలేకపోతున్నాడు.

దీంతో మోడీ పార్టీని దేశవ్యాప్తంగా గెలిపించే దిశగా ప్రణాలికలతో ముందుకు సాగుతున్నాడు. రాహుల్ మాత్రం ఇంకా పోరాడుతూనే ఉన్నాడు. అధికారం ఆ పార్టీకి దక్కితే రాహుల్ ప్రధాని అవుతాడని సోనియా చాలా కళలు కంటోంది. అయితే కొన్ని రోజుల క్రితమే సోనియా గాంధీ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకొని రాహుల్ కి అప్పగించిన సంగతి తెలిసిందే. ఇక పార్టీలో మునుపటి లనే మళ్లీ అంతర్గత విభేదాలు వస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. అందుకు రాహుల్ గాంధీ కొత్త ప్రణాళికలతో సిద్ధమవుతున్నాడు. ఫైనల్ నిర్ణయం తనదే కావాలని వర్కింగ్ కమిటీని రద్దు చేశాడు. కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత నిర్ణయీకరణ వ్యవస్థగా ఉన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ర‌ద్దు చేయడం నిజంగా పెద్ద ప్రయోగమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాహుల్ ఆలోచోన ఓ విధంగా కరక్టే అయినా సమర్ధవంతంగా రూల్స్ ని ఆచరణలో పెడతాడా లేదా అనేది చూడాలి