ఇలా అయితే ప్రధాని అవ్వడం కష్టమే రాహుల్ గారు?

Monday, March 5th, 2018, 08:46:19 AM IST

జాతీయ పార్టీగా దేశాన్ని ఎన్నో ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ అంటే ఒకప్పుడు ఎంత పెద్ద పార్టీగా ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి ఎలక్షన్స్ జరిగినా విజయాలను ఈజీగా అందుకునేది. లేదంటే మినిమమ్ పోటీని అయినా ఇచ్చేది. కానీ గత ఎన్నికల నుండి పార్టీ రూపు రేఖలు మారడంతో ఎన్నికల రిజల్ట్ లో కూడా చాలా తేడాలు వచ్చాయి. చాలా బలంగా ఉన్న స్థానాలను సైతం భారత జనతా పార్టీ ధాటికి వదులుకోవాల్సి వచ్చింది. అయితే ఇటీవల కాంగ్రెస్ పెద్దలు పార్టీ బాధ్యతలను పూర్తిగా రాహుల్ కి అప్పగించారు. కొంత మంది అడ్డు చెప్పినా కూడా సోనియా గాంధీ తన బలంతో పార్టీ పగ్గాలను రాహుల్ కి అందేలా చేశారు. అయితే రాహుల్ ఎన్ని ప్రచారాలను నిర్వహిస్తోన్న కూడా పోటీని అయితే ఇస్తోంది గాని అనుకున్నంతగా ప్రభావం చూపలేకపోతోంది.

మోడీ బీజేపీని గెలిపించే దిశగా సరికొత్త ప్రణాలికలతో ముందుకు సాగుతున్నాడు. రాహుల్ మాత్రం ఇంకా పోరాడుతూనే ఉన్నాడు. ఎంత కష్టపడినా అధికారం దక్కడం లేదు. త్రిపుర నాగాలాండ్ మేఘాలయ ఎన్నికల్లో రాహుల్ తన ఆలోచనలతో ప్రచారాలను నిర్వహించాడు. మూడు రాష్ట్రాల్లో అధికారం తప్పకుండా దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ మేఘాలయలో మాత్రమే గెలిచింది. అదికూడా అతి కష్టం మీద గెలవడంతో రాహుల్ ప్రయోగాలు సక్సెస్ అవ్వలేదు అనే కామెంట్స్ వస్తున్నాయి. బీజేపీ రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని అందుకుంది. అయితే రాహుల్ అధ్యక్షుడైన మొదటి పోటీలోనే పార్టీ ఇంత దారుణంగా ఓడిపోవడం అందరిని షాక్ కి గురి చేస్తోంది. ఉపాధ్యక్షుడిగా ఉన్నపుడు రాహుల్ అంతగా ప్రభావం ఏమి చూపలేదు. ఇప్పుడు పార్టీ పగ్గాలు అప్పగిస్తే సాధారణ పోరులోనే డిజాస్టర్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. రాహుల్ ని ప్రధానిగా చూడాలని సోనియా చాలా కళలు కంటున్నారు. మరి ఇలాంటి రిజల్ట్ తో రాహుల్ ఎలాంటి ప్రధానికి అవుతారో చూడాలి.