ఏపిలో రాహుల్ రాజకీయాలు మొదలయ్యాయి!

Tuesday, September 18th, 2018, 01:54:48 PM IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంతో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన అనంతరం ఏపిలో తుడిచి పెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. లోకల్ నాయకులే కాంగ్రెస్ పై విరక్తితో ప్రతిపక్షాల్లోకి జంప్ చేశారు. కొందరు మాత్రమే పార్టీని ఒంటి చేత్తో నడిపిస్తూ బలాన్ని చేకూరుస్తున్నారు. వైసిపి టీడీపీలది వన్ సైడ్ వార్ అయినప్పటికీ ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా పార్టీ మనుగడను కాపాడాలని అధిష్టానం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఇక మొత్తానికి చాలా కాలం తరువాత కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టారు. పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని ప్రణాళికలతో సిద్ధమవుతున్నారు.
మొదట కర్నూలు జిల్లాకు వెళ్లిన రాహుల్ అక్కడ పార్టీకి సంబందించిన విషయాలను అలాగే నేతలతో చర్చలు జరిపారు. శంషాబాద్‌ విమానశ్రయం నుంచి రాగనే ప్రత్యేక విమానంలో కర్నూల్‌ కు వెళ్లారు. పెద్దపాడులో దామోదర సంజీవయ్య నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను కలిశారు.

రాహుల్ తో పాటు మాజీ అమ్మ ఏపి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వెళ్లారు. అలాగే సీనియర్ నాయకులూ ఉమెన్‌ చాందీ, పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి కూడా వెళ్లారు. ముందుగా పార్టీకి ఉన్న వ్యతిరేకత తొలిగేలా జనాల్లో నమ్మకాన్ని కలిగించాలని, అనంతరం ప్రజలకు కాంగ్రెస్ చేపట్టిన గత అభివృద్ధి పనుల గురించి ఎక్కువగా గుర్తు చేయాలనీ సూచించారు. ఇక సాయంత్రం 4 గంటలకు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో జరిగబోయే భారీ బహిరంగ సభలో రాహుల్ పార్టీ భవిష్యత్తు కార్యచరణ గురించి వివరించనున్నారు.