రాహుల్ ప్లాన్ ఫెయిల్.. ఉంచుతారా? తిసేస్తారా?

Tuesday, May 15th, 2018, 05:13:00 PM IST

కాంగ్రెస్ పార్టీ గత కొంత కాలంగా ఎదుర్కొంటున్న పరాజయాలను చూసి ఎంతో కొంత అవగాహనా పెంచుకుంటుందని అంతా అనుకున్నా చివరికి మళ్లీ అదే రిపీట్ అయ్యింది. భారత జనతా పార్టీకి పోటీ ఇవ్వలేక ఆ పార్టీని ఎలాగైనా అధికారం దక్కకూడదని పక్క పార్టీతో చేతులు కలపడానికి సిద్దమయ్యింది. అసలు ఇలాంటి పరిస్థితి వస్తుంది అని ఎవరు ఊహించలేదు. ప్రచారంలో రాహుల్ చేసిన ప్లాన్స్ పెద్దగా వర్కౌట్ కాలేదని చెప్పాలి. మోడీ మంత్రం ముందు రాహుల్ గాంధీ సోనియా గాంధీ మాటలు ఎంత మాత్రం సక్సెస్ కాలేదు.

గతంలో జరిగిన ఎన్నికల్లోనే రాహుల్ లోపాలు స్పష్టంగా కనిపించాయి. ఎంత సేపు అవతల పార్టీ ఏం చేసింది అనే విషయంపైనే తప్ప కాంగ్రెస్ ఏం చేయగలుగుతుంది అనే విషయాన్ని ప్రజలకు ఎక్కించలేకపోయారు. ప్రతి ఎన్నికల్లో రాహుల్ ప్రణాళికలు లోపం స్పష్టంగా కనిపించింది. ఆయన ఎప్పుడు సరైన ప్లాన్స్ తో పార్టీని నడిపించలేదని పార్టీ నేతలే విమర్శలు చేస్తుండడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

సోనియా గాంధీ కొడుకుని ఎలాగైనా ప్రధాని చేయాలని చాలా కలలు కన్నారు. పార్టీని అతని చేతిలో పెడితే గెలిపిస్తాడని నమ్మకంగా అధ్యక్ష పదవిని వదులుకొని ఆయనకు అప్పజెప్పారు. కానీ రాహుల్ ఎక్కడ కూడా తన మేధస్సుతో పార్టీకి విజయాన్ని అందించలేకపోయారు. దీంతో అతన్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించి ప్రియాంక గాంధీకి బాధ్యతలు అప్పగించాలని సీనియర్ రాజకీయ నాయకులు సలహాలు ఇస్తున్నారు. మరి ఈ విషయంపై సోనియా గాంధీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments