న‌వ‌ తెలంగాణ నిర్మాణం.. కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం.. రాహుల్ గాంధీ సంచ‌ల‌నం..!

Sunday, October 21st, 2018, 12:50:53 AM IST

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తాజాగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌ధ్యంల‌తో తెలంగాణ పర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో ఆయ‌న తెలంగాణ ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై మండి ప‌డ్డారు. డాక్ట‌ర్ బీ ఆర్ అంబేద్కర్ పేరుతో ఉన్న ప్రాజెక్టు పేరు మార్చి చాలా పెద్ద త‌ప్పుచేశార‌ని రాహుల్ అన్నారు. కేసీఆర్ కుటుంబం చేసిన పాల‌నకు ముగింపు ప‌లికే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని.. దీంతో తెలంగాణ ప్ర‌జ‌లు కేసీఆర్ పాల‌న‌కు చ‌మ‌ర‌గీతం పాడాల‌ని రాహుల్ పిలుపునిచ్చారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతుల‌కు 2ల‌క్ష‌ల రుణ‌మాఫీ చేస్తామ‌ని 7వేలు మ‌ద్ద‌తు ఇస్తామ‌ని రాహుల్ తెలిపారు.

కేంద్రంలో ప్ర‌ధాని మోదీకి, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌కి దోస్తీ కుదిరింద‌ని, బీజేపీకి కేసీఆర్ దాసోహం అయ్యి.. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అన్యాయం చేస్తున్నార‌ని రాహుల్ ఫైర్ అయ్యారు. నీటి ప్రాజెక్టులు రీ డిజైనింగ్ పేరుతో, కేసీఆర్ ప్ర‌భుత్వం వేల కోట్ల రూపాయ‌లు ప్ర‌జాధ‌నాన్నిదోచుకున్నార‌ని, రాహుల్ ఆరోపించారు. ఇక గిరిజనులు, ఆదివాసీలకు సంబంధించిన సంక్షేమ ప‌థ‌కాల‌ను కేసీఆర్ పూర్తిగా ప‌క్క‌న‌బెట్టేశార‌ని.. అంతే కాకుండా అధికారంలోకి వ‌స్తే ఎస్సీ,ఎస్టీల‌కు మూడు ఎక‌రాల భూమిని ఇస్తామ‌న్నారు… తీరా అధికారంలోకి రాగానే కేసీఆర్ ఒక్క‌రికి కూడా అంగుళం భూమి కూడా ఇవ్వ‌లేద‌ని రాహుల్ మండిప‌డ్డారు. మీరు ఎలాంటి ఆశ‌యాల‌కోసం అయితే క‌ల‌లు క‌ని.. ఎన్నో ఏళ్ళు క‌ష్టించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారో.. వాట‌న్నిటిని కేసీఆర్ తుంగ‌లో తొక్కార‌ని.. న‌వ‌తెలంగాణ నిర్మాణం ఒక్క కాంగ్రెస్‌తోనే సాధ్య‌మ‌ని రాహుల్ గాంధీ స్ప‌ష్టం చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments