వందేమాతరం.. ఒక్క లైన్ లో ఫినిష్ చేయమన్న రాహుల్

Saturday, April 28th, 2018, 06:09:27 PM IST

కర్ణాటకలో ఎన్నికల ప్రచారాల వేడి తారా స్థాయికి చేరుతోంది. ఎలాగైనా 224అసెంబ్లీ స్థానాలను వీలైనంత వరకు దక్కించుకుకోవాలని కాంగ్రెస్ నేతలు బీజేపీ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఎవరు ఊహించని విధంగా రాహుల్ ప్రచారంలో చేసిన పొరపాటు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సభను దేశభక్తి గీతంతో ప్రారంభించాలని నిర్వాహకులు నిర్ణయించారు. దీంతో అందరూ వందేమాతరం పాడటం మొదలు పెట్టారు.

అయితే వందేమాతరం పాడుతోన్న గాయకులు ఒక్క లైన్ పాడగానే ఎండ్ చేయించారు. ఒక్కలైన్‌లో ముగించాల్సిందిగా రాహుల్ గాంధీ కర్ణాటక కాంగ్రెస్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌కు సైగ చేశారు. దీంతో అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దేశభక్తి గీతాన్ని ఒక్క లైన్ లోనే ముగించడం ఏమిటని అంతా ఆశ్చర్యపోయారు. కానీ రాహుల్ మాత్రం అవేమి గ్రహించలేదు. సభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు చాలా మంది సినియర్ కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఆ ఘటన కు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలాగే బీజేపీ నేతలు కౌంటర్లు వేయడం ప్రారంభించారు. సామాన్య వ్యక్తులే వీలైనప్పుడల్లా దేశ భక్తిని ఆలపిస్తుంటారు. కానీ ఒక పార్టీ అద్యక్షుడై ఉండి వందేమాతరంకు ఎలాంటి గౌరవం ఇవ్వలేదు. అలాంటి వ్యక్తి ఎలాంటి పాలన చేస్తాడని ప్రశ్నించారు.

  •  
  •  
  •  
  •  

Comments