రాహుల్ పంచ్ లకు పేలుతున్న కామెడీ పంచ్ లు !

Wednesday, November 1st, 2017, 11:39:37 AM IST

ఆ మధ్యన జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ తనకు మార్షల్ ఆర్ట్స్ వచ్చని స్వీట్ షాక్ ఇచ్చాడు. సొట్టబుగ్గలతో సుకుమారుడిలా కనిపించే రాహుల్ గాంధీలో ఇంత విషయం ఉందని అంతా తేరుకునేలోపే ఈ కాంగ్రెస్ యువరాజు మరో షాక్ ఇచ్చాడు. రాహుల్ గాంధీ అకిడో అనే మార్షల్ ఆర్ట్ శిక్షణ పొందుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనిపై నెట్ జనాలు అప్పుడే కామెడీ పంచ్ లు వేయడం మొదలు పెట్టేశారు. నెటిజన్లు పెడుతున్న కామెంట్లు ఇలా ఉన్నాయ్..

”రాహుల్ గాంధీ బాలీవుడ్ సినిమాల్లో నటించాలి.. వచ్చే ఎన్నికల్లో పోరాటానికి రాహుల్ ఇప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలు పెట్టాడా.. అంటే రాహుల్ గాంధీ కుక్క పిల్ల పిడి కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటుందా.. ఇలా ఎవరికీ తోచిన విధంగా వారు రాహుల్ అకిడో ట్రైనింగ్ పిక్స్ పై కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫోటోలకు తెగ లైకులు షేర్లు దక్కుతున్నాయి. ఓ సమావేశంలో భాగంగా రాహుల్ గాంధీ, బాక్సర్ విజేందర్ సింగ్ మధ్య జరిగిన సంభాషణలో రాహుల్ కు ఈ మార్షల్ ఆర్ట్ విద్య వచ్చు అనే విషయం బయట పడింది. తనకు క్రీడల్లో కూడా మంచి ప్రావీణ్యం ఉంది అని రాహుల్ గాంధీ ప్రస్తావించగా.. అలాగైతే వాటికి సంబందించిన ఫోటోలని అభిమానులతో పంచుకోవాలని విజేందర్ సింగ్ రాహుల్ ని కోరాడు.

  •  
  •  
  •  
  •  

Comments