అమ్మ కనుసైగతోనే రాహుల్ అడుగులు.. మిషన్ తెలంగాణ!

Friday, August 10th, 2018, 02:04:29 AM IST

అరవై ఏళ్లుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీకి ప్రతిసారి ఎదో ఒక పెద్ద ఇబ్బంది వస్తూనే ఉంటుంది. ఆ పార్టీ మొదలైనప్పటి నుంచి జరిగిన పరిణామాలను గమనిస్తే అర్ధమవుతుంది. ప్రతి రాష్ట్రంలో పట్టు సాధించాలని తపనపడే అధిష్టానం గత కొంతకాలంగా తడబడుతున్న సంగతి తెలిసిందే. సోనియా గాంధీ పార్టీ పగ్గాలను కొడుకు రాహుల్ గాంధీ చేతిలో పెట్టి రెస్ట్ తీసుకోవాలని చాలా సార్లు అనుకున్నారు. కానీ వెలువడుతున్న ఫలితాలను చూస్తుంటే రాహుల్ గాంధీపని సోనియా గాంధీ అంతగా నమ్మడం లేదనే టాక్ వస్తోంది.

గతంలో రాహుల్ సొంత నియోజకవర్గం అమేథీలోనే కనీసం మున్సిపల్ ఎన్నికల్లో కూడా విజయం సాధించలేదు. రాహుల్ ని ఎలాగైనా ప్రధాని చెయ్యాలని ఆమె చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఏ విధంగా వర్కౌత్ అవుతుంది అనేది పెద్ద సందేహమే. సీనియర్ నేతలు చాలా మంది ఉన్నప్పటికీ రాహుల్ కి మద్దతు ఇవ్వడంలో కీలకంగా ఎవ్వరూ కూడా కనిపించడం లేదు. అందుకే రాహుల్ గాంధీ చేసే ప్రతి పనిపై అధిష్టానం సమక్షంలో సోనియా గాంధీ సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఏం మాట్లాడాలి అనే విషయం నుంచి ఎలాంటి ఆలోచనతో నడుచుకోవాలి అనే విషయాల్లో అధిష్టానం నిర్ణయల ప్రకారం నడవాలని రాహుల్ కు సూచించినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా తెలంగాణ విషయంలో ఇటీవల కాంగ్రెస్ నేతలతో సోనియాగాంధీ ప్రత్యేకంగా చర్చలు జరిపారట. కాంగ్రెస్ వల్లే తెలంగాణ వచ్చింది అనే విషయాన్నీ లోకల్ నాయకులు ప్రజలకు అర్థమయ్యేలా వివరించలేదని ఇప్పటికైనా మళ్ళీ అధికారం దక్కించుకునేలా కృషి చేయాలనీ చెప్పారట. ముఖ్యంగా రాహుల్ సమక్షంలో ప్రణాళికలను ఆచరణలో పెట్టాలని సోనియా గాంధీ వివరించినట్లు తెలుస్తోంది. అందుకే రాహుల్ ఇప్పుడు తెలంగాణపై ప్రత్యేక ద్రుష్టి పెట్టారు.

ఎన్నికల సమయం వరకు ప్రతి నెలలో ఒకసారి తెలంగాణలో పర్యటించాలని ప్లాన్ వేసుకున్నారు. మిషన్ తెలంగాణ పేరుతో స్టార్ట్ కాబోయే ఈ పర్యటన ఈ నెల 13న మొదలు కానుంది. కాంగ్రెస్ నేతలతో పాటు జనాలకు దగ్గరయ్యే విధంగా రాహుల్ సమావేశాలకు హాజరుకానున్నారు. వచ్చే నెల ఒక భారి బహిరంగ సభకు కూడా కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. మరి ఈ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments