మిస్టర్ ప్రైమినిస్టర్.. మీ మౌనం వెనక ఆంతర్యం ఏమి :రాహుల్ గాంధీ

Saturday, April 14th, 2018, 02:04:25 AM IST

దేశంలో సంచలనం రేపుతున్న రెండు అత్యాచార ఘటనలపై ప్రధాని మోదీ స్పందించకపోవడం శోచనీయంగా మారింది. ఉన్నావ్, కథువాలో జరిగిన గ్యాంగ్ రేప్ కేసులపై ప్రధాని మోదీ ఎందుకు స్పందించడంలేదని, ప్రధాని మౌనం సహించరానిదని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మిస్టర్ ప్రైమ్‌మినిస్టర్.. మీ మౌనం సహించరానిదని ఆయన ఆ ట్వీట్‌లో తెలిపాడు. ఆ ట్వీట్‌లో రాహుల్ రెండు ప్రశ్నలు కూడా వేశారు. మహిళలు, చిన్నారుల పట్ల జరుగుతున్న హింస గురించి మీరేమి ఆలోచిస్తున్నారు, రేప్ కేసులో ఉన్న నిందితులను ఎందుకు మీరు రక్షిస్తున్నారని రాహుల్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలపై మీ సమాధానం కోసం యావత్ దేశం ఎదురుచూస్తోందన్నారు. అత్యాచార ఘటనలకు నిరసనగా నిన్న రాత్రి దేశ రాజధాని ఢిల్లీలో రాహుల్ కొవ్వొత్తుల