రాహుల్ ట్వీట్లు పాకిస్థాన్ కు హెల్ప్ అయ్యాయి !

Sunday, September 23rd, 2018, 05:38:15 PM IST

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాఫెల్ ఒప్పందంలో మోదీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేస్తూ ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్లు దేశంలో ఉన్న భాజాపా వ్యతిరేక పార్టీలకు మంచి ఫీడ్ ఇవ్వగా పాకిస్థాన్ సైతం ఈ ట్వీట్లను మోదీపై, దేశంపై విమర్శలు చేయడానికి
ఉపయోగించుకుంది.

పాక్ మంత్రి ఫవాద్ హుస్సైన్ రాహుల్ ట్వీట్లను రీట్వీట్ చేస్తూ భారత్ పాకిస్థాన్ పై కక్ష సాధింపుకు పాల్పడుతోందని, అందుకు ఈ ట్వీట్లే నిదర్శనమని వాపోయారు. అంతేకాదు రాఫెల్ ఒప్పందంలో జరిగిన అవినీతి నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇరు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య జరగాల్సిన సమావేశాన్ని మోదీ రద్దు చేశారని, ఈ తీరును తాము ఖండిస్తున్నామని చెబుతూ పరోక్షంగా మోదీ అవినీతికి పాల్పడ్డారనే రాహుల్ ఆరోపణకు పూర్తిగా ఏకీభవించారు. ఎప్పుడెప్పుడు సాకు దొరుకుతుందా భారత్ మీద మాటలతోనే, చేతలతోనో కోపం తీర్చుకుందామని ఎదురుచూసే పాక్ కు రాహుల్ వేసిన ట్వీట్లు ఇలా సహాయపడ్డాయి.