వీడియో : డైరెక్ట్ గా వచ్చి రాహుల్ మెడలో పడింది!

Friday, April 6th, 2018, 10:46:51 AM IST

కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన తరువాత రాహుల్ గాంధీ ఏ మాత్రం రెస్ట్ తీసుకోవడం లేదు. ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నాయని తెలిసినా వాలిపోతున్నారు. చిన్న ఎలక్షన్స్ అయినప్పటికీ తన మార్క్ ఉండేలా చూసుకుంటున్నాడు. ప్రత్యేక ప్రణాళికలను రచించి గ్రామా స్థాయి నుంచి పార్టీని బలంగా చేస్తున్నాడు. ప్రస్తుతం కర్ణాటకలో కూడా రాహుల్ గాంధీ చాలా బిజీ అయ్యాడు. మరి కొన్ని రోజుల్లో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో తన ప్రచారాలను చాలా స్పీడ్ గా చేస్తున్నాడు.

అయితే రీసెంట్ గా చేసిన ప్రచారంలో రాహుల్ కి ఆశ్చర్యపోయే అనుభవం ఎదురైంది. ఆ ఘటనను చుసిన వారు కూడా షాక్ అయ్యారు. వ్యాన్ మీద నిలబడి ప్రచారం నిర్వహిస్తున్న రాహుల్ మెడలో దండ వచ్చి పడింది. ఓ అభిమాని వేసిన దండకి రాహుల్ ఒక్క సెకన్ షాక్ అయ్యి తిరిగి చూశాడు. గుంపులో ఎవరో తెలియక అందరికి అభివాదం చేసుకుంటూ వెళ్లాడు. ప్రస్తుతం అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కన్నడ హీరోయిన్, కాంగ్రెస్ నేత దివ్య కూడా వీడియోను షేర్ చేస్తూ.. కర్ణాటకలో టాలెంట్ ఉందని కామెంట్ చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments