ప్రధాని పదవి పై రాహుల్ షాకింగ్ కామెంట్స్ !

Tuesday, May 8th, 2018, 03:13:33 PM IST

ప్రస్తుత యుపిఎ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్ణాటక ఎన్నికల సందర్భంగా అక్కడ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కాగా ఆయన నేడు రాజధాని బెంగళూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ రానున్న 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనుక అతిపెద్ద పార్టీగా అవతరిస్తే తాను ప్రధాని పదవి చేపడతానన్నారు. మీరే ప్రధాని అవుతారా అని ఒక విలేకరి అడగ్గా, అది కాంగ్రెస్ పార్టీ గెలుపు పై ఆధారపడివుంటుంది, ఒకవేళ మేము అనుకున్నట్లు అన్ని కలిసివచ్చి కాంగ్రెస్ పెద్ద పార్టీగా అవతరించి పూర్వ రూపాన్ని సంతరిస్తే తాను ఆ పదవి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఏ మాత్రం కొంచెం అవకాశం దొరికినా ప్రధాని మోడీపై అలానే బిజెపి విమర్శలు చేసే రాహుల్ నేడు వారిపై మరింత దాడిచేశారు.

ప్రజలకు ప్రస్తుత బిజెపి పాలన నచ్చడం లేదని,ఆ పార్టీ ఎప్పుడు గద్దె దిగుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు అని అన్నారు.ఇకపోతే ప్రధాని నరేంద్ర మోడీ ఈ సారి తన నియోజకవర్గమైన వారణాసిలో ఓటమిపాలు కాకతప్పదని జోస్యం చెప్పారు. అలానేఎన్డీయే నేతృత్వంలోని బిజెపి కూడా ఓటమిని చవిచూస్తుందని అన్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకమై బిజెపిని ఓడించడానికి సిద్దమవుతున్నాయని ఆయన తెలిపారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తాయా అనే సందిగ్ధం ఏర్పడిన ఈ సందర్భంలో రాహుల్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కర్ణాటక ప్రజలు ఎప్పుడు మంచికి, మంచి చేసే పాలకులకు ఓటేస్తారని, కుటిలరాజకీయాలు చేసే బిజెపి నేతలకు ఓటువేస్తారని తాను అనుకోవడంలేదన్నారు…….

  •  
  •  
  •  
  •  

Comments