మాట నిలుపుకున్న రాహుల్…

Friday, November 16th, 2018, 03:00:50 PM IST

కాంగ్రెస్ పార్టీ లో సీనియర్ నాయకుడు, గత ఎన్నికలలో సీట్ల పంపిణి విషయం లో ముఖ్య పాత్ర వహించినటువంటి పొన్నాల లక్ష్మయ్య కి కూటమి పంపిణి చేసిన సీట్లతో జనగామా నియోజకవర్గ విషయంలో తీవ్ర అసంతృప్తి కి లోనైనా సంగతి మనందరికీ తెలిసిందే, కానీ ఆయన జనగామ సీటు కావాలని పట్టుబట్టి కూర్చున్నాడు. కానీ అక్కడ ఇంతకుముందు కూటమిలో భాగమైన కోదండరాం కి టికెట్ ఇచ్చారు. ఈ నిర్ణయం తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ పొన్నాల ఢిల్లీ కి పయనమై అక్కడ రాహుల్ గాంధీ తో సమావేశమయ్యారు.

ఎలాగైనా జనగామా టికెట్ తనకే కావాలని పట్టుబట్టి కూర్చున్నాడు. చివరికి కోదండరాం తో రాహుల్ మంతనాలు జరిపి జనగామ టికెట్ ని మహాకూటమి లో భాగంగా పొన్నాల లక్ష్మయ్య కి కేటాయించినట్లు తాజా సమాచారం. ఈ మేరకు కోదండరాం ని బుజ్జగించినట్లుగా తెలుస్తుంది. ఇంకా సనత్ నగర్ నుండి మర్రి శశిదర్ కి అవకాశం వచ్చిందని తెలుస్తుంది. ఈ మేరకు పొన్నాలకి మరియు మర్రి శశిధర్ కి లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తుంది. విడుదల కాబోయే మరో జాబితాలో కోదండరాం కి ఎక్కడి నుండి అవకాశం వస్తుందో తెలియాల్సి ఉంది.