రాహుల్ ప్రధాని కావాలంటున్న బిజెపి నేత!

Sunday, May 13th, 2018, 06:14:24 PM IST

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల తాను ప్రధాని కావాలనుకుంటున్నట్లు కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ విషయం పై ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు ప్రధాని పదవిపైన తప్పితే ప్రజా సంక్షేకం మీద ఏమాత్రం శ్రద్ధ లేదని విమర్శించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇదే విషయాన్నీ బిజెపి నేత శత్రుజ్ఞ సిన్హా లేవనెత్తారు. రాహుల్ ప్రధాని కావాలనుకోవడం తప్పులేదని, అయినా కొన్ని ఏళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం అధ్యక్షుడుగా వున్న రాహుల్ ఆ పదవికి సమర్ధువని, గత కొన్నాళ్లుగా ఆయనలో పరిపక్వత కనపడుతోందని అన్నారు.

అయినా ఆయన ప్రధాని కావాలనుకుంటే అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలపాలి కానీ, విమర్శించడం దేనికని, ప్రధాని మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతే కాదు, రాహుల్ రానున్న ఎన్నికల్లో తమ పార్టీ మంచి మెజారిటీతో విజయం సాధించి, అలానే అందరు నాయకుల ఆమోదం తనకు ఉంటే ప్రధాని పదవి చేపడతాను అన్నారు. అది ఏమాత్రం తప్పుకాదని శత్రుజ్ఞ అన్నారు. కలలు ఎవరైనా కనవచ్చని, అయినా ప్రధాని కావడానికి ప్రత్యేక జ్ఞానం, తెలివితేటలు ఏమి అవసరంలేదని సాధారణ మానవుడైన, కార్మికుడైన, కర్షకుడైన, ఎవరైనా సరే ఆ పదవి చేపట్టేందుకు అర్హులని చెప్పారు.

ఇప్పటికే సీబీఐ నీరవ్ మోడీ, లలిత్ మోడీ, రాఫెల్ తదితర నేరాలపై బిజెపిని ప్రశ్నిస్తుంటే మనం వాటిని తిరస్కరించడం, ఉపేక్షించడం వంటివి చేస్తున్న విషయం మరచిపోకూడదన్నారు. అంతేకాదు ప్రధాని 130 కోట్ల ప్రజలకు ప్రధానిగా వున్న ఆయన జాతీయపార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ పై చేస్తున్న వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. అసలు ప్రధాని చేస్తున్న వ్యాఖ్యలు ఎల్కేజీ పిల్లలకు పాఠాలు చెపుతున్నట్లుందని, మోడీజీ మన దేశం స్కూలేమి కాదని సోషల్ మీడియా వేదికగా చురకలు అంటించారు. అయితే ఆయన వ్యాఖ్యలపై కొందరు బిజేపినేతలు తమ నిరసనను బహిరంగంగానే తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు బిజెపిలో తీవ్ర కలకలం రేపుతున్నాయి……..

Comments