టికెట్ లేకుండా ప్రయాణిస్తే ఇక అంతే.. జాగ్రత్త!

Friday, June 8th, 2018, 09:50:07 AM IST

ప్రస్తుత రోజుల్లో చాలా వరకు రైళ్లలో టికేట్ లేకుండా ప్రయాణించే వారి సంఖ్య రోజు రోజుకి ఎక్కువవుతోంది. రైల్వే సిబ్బంది చెక్ చేసిన ప్రతి సారి టికెట్ లేకుండా ప్రయాణించే వారు దొరుకుతున్నారు. దీని వల్ల రైల్వే శాఖకు తీవ్రంగా నష్టపోతోంది. అందుకే ఇటీవల రైల్వే కమిటీ కొన్ని మార్పులు చేస్తూ కఠిన నిర్ణయాలు తీసుకోనుంది. అలాగే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ముందుగా టికెట్ లేకుండా ప్రయాణించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఈ నెల 22 నుంచి రైల్వే కమిటీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుంది. 23న ప్రిన్సిపల్ కమర్షియల్ మేనేజర్లకు ఇందుకు సంబంధించిన నివేదికను అందించనున్నారు. టికెట్ లేదని తెలిస్తే భారీ జరిమానాకు విధించాలని రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. మెయిన్ గా టికెట్ ట్రాన్స్‌ఫర్, టికెట్ లెస్, నకిలీ, ఫోర్జ్‌డ్ టికెట్ల పైన ప్రత్యేక దృష్టిసాదించి అందుకు తగిన చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇక ఆలస్యంగా వస్తున్న ట్రైన్ లను కరెక్ట్ సమయానికి వచ్చేలా చర్యలు తీసుకోనున్నారు. భోజనం వంటి విషయాలలో మరింత నాణ్యత ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది.