రైల్వేస్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. బ‌్ల‌డ్‌ రిలేష‌న్‌కి టిక్కెట్ బ‌ద‌లాయింపు ఛాన్స్‌!

Friday, February 17th, 2017, 10:45:03 PM IST


వెరీ గుడ్ న్యూస్‌.. ఇన్నాళ్లు ట్రెయిన్ టిక్కెట్ బుక్ చేస్తే .. ఎవ‌రి పేరుపై బుక్ చేశారో..వాళ్లు మాత్ర‌మే వెళ్లాల్సొచ్చేది. ఆ టిక్కెట్టును వేరొక‌రి పేరు మీదికి బ‌ద‌లాయించుకునే ఛాన్స్ ఉండేది కాదు. సొంత‌ వైఫ్‌కో, అమ్మ‌కో, నాన్న‌కో లేక త‌మ్ముడికో, అన్న‌కో, కూతురికో ఇవ్వాల‌న్నా రూల్స్ ఒప్పుకునేవి కావు. దీనివ‌ల్ల అడ్వాన్స్‌డ్‌గా నెలల ముందే రిజ‌ర్వేష‌న్ చేయించుకున్న టిక్కెట్టును క్యాన్సిల్ చేసుకోవాల్సొచ్చేది.

అయితే ఇక‌నుంచి రూల్ బుక్ మారింది. ఇండియ‌న్ . ఇండియ‌న్ రైల్వేస్ కొత్త రూల్ తెచ్చింది. ఆ మేర‌కు కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్ర‌భు స‌వ‌రించిన కొత్త రూల్‌ని అమ‌ల్లోకి తేనున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఇక‌నుంచి ఎవ‌రిపేరు మీద రిజ‌ర్వేష‌న్ చేయించుకున్నా.. బ్ల‌డ్ రిలేష‌న్‌కి టిక్కెట్టును మార్పిడి చేయించుకోవ‌చ్చు. అలాగే ప్ర‌భుత్వోద్యోగులు అయితే వేరొక ప్ర‌భుత్వోద్యోగికి టిక్కెట్టును బ‌ద‌లాయించుకోవ‌చ్చు. స్టూడెంట్స్ సైతం వేరొక స్టూడెంట్‌కి బ‌ద‌లాయించుకునే వెసులుబాటు ఉంది. అయితే ఎవ‌రి పేరు మీదికి బ‌ద‌లాయిస్తున్నారో వారి ఐడీ ప్రూఫ్‌ను ఛీఫ్ రిజ‌ర్వేష‌న్ సూప‌ర్‌వైజ‌ర్‌కి రైలు బ‌య‌ల్దేరే స‌మ‌యానికి 24 గంట‌ల ముందు స‌బ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది రైల్వేస్‌కి సంబంధించినంత వ‌ర‌కూ గొప్ప ఇనిషియేష‌న్‌. ఇది ల‌క్షలాది ప్ర‌యాణీకుల‌కు ఎంతో ఉప‌యుక్త‌మైన‌ది.