అది ప్రమాదం కాదు కుట్ర..రైల్వే ట్రాక్ వద్ద అనుమాస్పద పరికరం..?

Sunday, January 22nd, 2017, 05:15:51 PM IST

train-accident
విజయనగరం జిల్లాలో జరిగిన హిరాఖంఢ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం పై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అది ప్రమాదం కాదని దీనివెనుక కుట్ర దాగివుందని రైల్వే శాఖ భావిస్తోంది. రైలు ప్రమాదం జరిగిన ప్రాంతం నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా నక్సల్ తమ ఉనికిని చాటుకునేందుకు ఈ ఘటనకు పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఘటన స్థలం లో అనుమానాస్పద పరికరం లభ్యం అయిందని రైల్వే అధికారులు అంటున్నారు. విజయన నగరం జిల్లాలో కూనేరు రైల్వే స్టేషన్ సమీపం లో ఈ ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన లో 40 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.నిజంగానే దీనివెనుక కుట్ర జరిగి ఉంటే వారిని వదిలి పెట్టమని రైల్వే శాఖ చెబుతోంది. శనివారం అర్థ రాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన లో మృతి చెందిన కుటుంబాలకు రూ 5 లక్షల ఎక్స్ గ్రేషియా ని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. రైల్వే శాఖ రూ. 2 లక్షలు ప్రకటించింది.