జస్ట్ ఫర్ లాఫ్స్ : రోడ్లన్నీ ఇలానే ఐతే నిజంగా గోల్కొండే..!

Tuesday, September 27th, 2016, 08:03:04 PM IST

way-to-golkonda
హైదరాబాద్ లో వర్షాలకు రోడ్ల దుస్థితిని వివరించడానికి ఈ ఫోటో చాలు.రోడ్ మధ్య భాగంలో మాన్ హోల్ తెరుచుకుని ఉంది.వాహనదారులు ఆ గోతిలో పడకుండా ఎలాగోలా ఆపాలిగా.. అందుకే ట్రాఫిక్ పోలీస్ లు ఆ మాన్ హోల్ పై గోల్కొండకు దారిని సూచించే బ్యారికేడ్ ను రక్షణగా ఉంచారు. సోషల్ మీడియాలో హైదరాబాద్ రోడ్లదుస్థితి పై రకరకాల కామెంట్స్ పడుతున్నాయి.రోడ్ లు అన్ని ఇలానే ఉంటె అందరు గోల్కొండకే అని సరదాగా జోకులు వేస్తున్నారు. మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్ లు త్వరలోనే హైదరాబాద్ రోడ్ లని సుందరంగా తీర్చిదిద్దుతామని అంటున్నారు. సుందరం సంగతి తరువాత..ముందు ఇలాంటి మాన్ హోల్ లని మూయించండి ముఖ్యమంత్రిగారూ..