ఒప్పందం వల్ల నష్టపోయిన హీరో, నిర్మాత.. మంచి డీలే కానీ?

Wednesday, June 6th, 2018, 03:00:53 PM IST

సాధారణంగా ఒక హీరో మరియు నిర్మాత మధ్య ఒప్పందాలు కుదరడం అనేది చాలా అరుదైన విషయం. అప్పట్లో ఒక కమిట్మెంట్ తో వరుసగా నిర్మాతలతో సినిమాలు చేసేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో హీరోలు అలాంటి వాటికీ ఎక్కువగా ఒప్పుకోవడం లేదు. అడ్వాన్స్ తీసేసుకొని ముందే సినిమా చేయాలనీ ఫిక్స్ చేసుకుంటే వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఇకపోతే రీసెంట్ గా రాజ్ తరుణ్ గతంలో అనిల్ సుంకరతో ఒక ఒప్పందం చేసుకున్నాడని తెలుస్తోంది.

అందువల్ల ఇప్పుడు ఇద్దరు లాస్ అవ్వాల్సి వచ్చిందట. రాజ్ తరుణ్ కెరీర్ దెబ్బ తినడంతో పాటు నిర్మాత ఇన్నేళ్లు సంపాదించుకున్నది కూడా నాలుగు సినిమాలతోల్ పోగొట్టుకోవాల్సి వచ్చిందను టాక్ వస్తోంది. నాలుగు కోట్ల విలువగల ఒక ప్రాపర్టీ రాజ్ తరుణ్ కి రాసిచ్చి నాలుగు సినిమాల డీల్ ను సెట్ చేసుకున్నాడట అనిల్ సుంకర. అయితే మొదటి సినిమా ఈడోరకం ఆడోరకం బాగానే ఆడినా ఆ తరువాత వచ్చిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త ఊహించని ఫలితాన్ని ఇచ్చింది. దాని తరువాత చేసిన అందగాడు కూడా ఫ్లాప్ అయ్యింది.

ఇక రీసెంట్ గా రాజుగాడు సినిమా కూడా డిజాస్టర్ అవ్వడంతో రాజ్ తరుణ్ మార్కెట్ పడిపోవడంతో పాటు నిర్మాత కూడా నష్టాలను చూడాల్సి వచ్చిందిట. ఎదో ఒప్పందం కుదుర్చుకున్నాం కదా అని నిర్మాత తొందరపాటులో కథలను ఒకే చేయడం రాజ్ తరుణ్ కూడా హ్యాండ్ ఇవ్వకూడదు అని తొందరగా డీల్ ఫినిష్ చెయ్యాలని సినిమాలు చేశాడు. మంచి డీల్ అయినా కూడా కథలు వర్కౌట్ కాకపోవడంతో ఇద్దరు నష్టపోవాల్సి వచ్చిందని టాలీవుడ్ లో టాక్ వస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments