జ‌క్క‌న్న కాపీ క్యాట్‌.. ప్రూఫ్ ఇదిగో?!

Saturday, February 25th, 2017, 01:22:00 PM IST


ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి క్రియేటివిటీ గురించి చాలామంది ర‌క‌ర‌కాలుగా సందేహాలు వ్య‌క్తం చేస్తుంటారు. ప్ర‌ఖ్యాత హాలీవుడ్ సినిమాలు కాపీ చేసి ఆయ‌న సినిమాలు తీస్తారంటూ మీడియాలో ప‌లు క‌థ‌నాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. బాహుబ‌లి చిత్రంలో శివ‌గామి పోస్ట‌ర్ కాపీ అంటూ ప్రూఫ్‌ల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. అలాగే మ‌రోసారి ప్రూఫ్ దొరికింది. నిన్న‌రిలీజైన‌ బాహుబ‌లి-2 మోష‌న్‌ పోస్ట‌ర్ జ‌నాల‌కు పిచ్చిగా న‌చ్చేసింది. అయితే రాజ‌మౌళి రిలీజ్ చేసిన ఈ కొత్త పోస్ట‌ర్ ఓ ప్ర‌ఖ్యాత హాలీవుడ్ సినిమా పోస్ట‌ర్‌కి కాపీ అంటూ ప్రూఫ్ ల‌తో స‌హా బ‌య‌ట పెడుతున్నారు. ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మంలో ఇదో హాట్ టాపిక్‌. ప్ర‌ఖ్యాత హాలీవుడ్ న‌టుడు టోనీ ఝా న‌టించిన `ఆంగ్ బాక్‌` సిరీస్ ఎంత‌టి పాపుల‌రో తెలిసిందే. ఈ సిరీస్‌లో `ఆంగ్ బాక్ 3` తెలుగులోనూ రిలీజై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఒళ్లు గ‌గుర్పొడిచే విన్యాసాల‌తో ఝా చేసే పోరాట విన్యాసాలు మైమ‌రిపిస్తాయి. ఇప్పుడు ఆ సినిమా క్రియేటివ్ పోస్ట‌ర్ ని జ‌క్క‌న్న కాపీ కొట్టేయ‌డం చ‌ర్చ‌కొచ్చింది. నిన్న లాంచ్ చేసిన బాహుబ‌లి-2 కొత్త మోష‌న్ పోస్ట‌ర్ ఆంగ్‌బాక్ 3 పోస్ట‌ర్‌ని పోలి ఉందంటూ నెటిజ‌నులు తూర్పార‌బ‌డుతున్నారు.