ఇంట్రస్టింగ్ అప్డేట్ : “RRR” పోస్టర్లో వీటిని గమనించారా..?

Friday, March 15th, 2019, 08:20:27 PM IST

రాజమౌళి, రామ్ చరణ్, రామారావు.ఈ ముగ్గురి పేర్లలో కామన్ గా కలిసే అక్షరం R,అందుకే ఈ ముగ్గురి కాంబినేషన్లో చేస్తున్న సినిమాకి RRR అనే పేరు పెట్టి ఉండొచ్చు అనేది చాలా మంది భావన. కానీ దీని వెనుక రాజమౌళికి వేరే స్ట్రాటజీ ఉండొచ్చేమో ఎవరికి తెలుసు.?ఈ ఇద్దరు హీరోలు ఇది వరకే రాజమౌళితో సినిమా తీసి బంపర్ హిట్లు అందుకున్న వారే..అలాగే రాజమౌళి కూడా తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాతరాలు దాటించేసారు.అలాంటిది ఈ ముగ్గురి కలయికలో సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు.ఈ సినిమాపై ఉన్న చాలా అంశాలపై క్లారిటీ ఇచ్చేందుకు నిన్ననే ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు.

ఈ మీట్ లోనే చరణ్ మరియు తారక్ ల పాత్రలు ఏ విధంగా ఉండబోతున్నాయో అన్న దానికి ఒక క్లారిటీ కూడా ఇచ్చేసారు.వీరిద్దరి పాత్రలను ప్రతిబింబిస్తూ ఒక పవర్ ఫుల్ పోస్టర్ ను కూడా విడుదల చేయగా దానికి అభిమానులుతో పాటు సినీ ఇండస్ట్రీ నుంచి అద్భుత రెస్పాన్స్ వచ్చింది.అయితే ఈ పోస్టర్ ని సరిగ్గా గమనించారంటే అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ను వెలికి తియ్యొచ్చు..ఈ పోస్టర్ ను గమనించినట్లయితే రామ్ చరణ్ మరియు తారక్ లు ఇద్దరూ ఒకరి పక్కన ఒకరు ఉరిమి చూస్తున్న లుక్ ను రాజమౌళి డిజైన్ చేసారు.చరణ్ కంటిలో కోపం కనిపిస్తుంటే తారక్ కంటిలో ఉగ్రం కనిపిస్తుందని స్పష్టంగా తెలుస్తుంది.

అలాగే నీరు,నిప్పు రెండు వేర్వేరు లక్షణాలను చూపిస్తాయి.నిప్పు రగిలితే దాని ధాటి ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలుసు దాన్ని చల్లార్చే గుణం నీరుకి ఉంటుంది,ఇది ఈ ఇద్దరిలో ఉండేలా చరణ్ నుంచి నిప్పులు కక్కుతుంటే తారక్ నుంచి దాన్ని చల్లార్చే నీటిని వెదజల్లుతున్నాడు.ఇక్కడే ఇంకా లోతుగా పరిశీలిస్తే..రాజమౌళి ఇంకా ఏదో దాస్తున్న భావన కలుగుతుంది.ఎందుకంటే మండే జ్వాలలు వస్తున్న చరణ్ ముఖాన్ని చూస్తే మళ్ళీ నీరు కనిపిస్తుంది..అలాగే నీటిని వెదజల్లుతున్న తారక్ ముఖంలో ఎలాంటి నీటి చుక్క కూడా కనిపించకపోగా కంటిలో మండే అగ్ని గోళం కనిపిస్తుంది.ఇలా ఒకే పోస్టర్ లో రాజమౌళి ఇన్ని ఆసక్తికర విషయాలను పెట్టేసారు.మరి సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో చూడాలి.ఈ సినిమా 2020 జూలై 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.