RRR అప్ డేట్: జక్కన్న అసలు విషయాన్ని రివీల్ చేస్తాడా..?

Wednesday, March 13th, 2019, 06:00:31 PM IST

రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ RRR విషయంలో ఉన్న సస్పెన్స్ కు రేపే తెర పడనుంది. సినిమా కథ, టైటిల్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ల పాత్రల గురించి వస్తున్న రక రకాల ఊహాగానాలపై రేపటి ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇవ్వనున్నారట రాజమౌళి. ఈ ప్రెస్ మీట్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ , రాజమౌళి పాల్గొననున్నారని సమాచారం. గతంలో మగధీర, ఈగ , మర్యాద రామన్న, సినిమాల సమయంలో కూడా విడుదలకు ముందే కథ రివీల్ చేసాడు జక్కన్న.

కథ, టైటిల్ తో పాటుగా సినిమాలో హీరోయిన్ల పేర్లను కూడా రేపటి ప్రెస్ మీట్ లో రివీల్ చేయనున్నారని సమాచారం. సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారని, గురువారం జరుగనున్న ప్రెస్ మీట్ లో కనీసం ఇద్దరి పేర్లైనా రివీల్ చేసే అవకాశముందని టాక్ వినిపిస్తుంది. మరీ, వీటితో పాటుగా రేపటి ప్రెస్ మీట్ లో ఇంకెన్ని విశేషాలు రివీల్ అవుతాయో వేచి చూడాలి.