రాజధాని కోసం రాజమౌళి ఆలోచనలు బావున్నాయట

Wednesday, October 25th, 2017, 12:00:58 PM IST

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజధాని నిర్మాణ పనులల్లో చాలా బిజీగా ఉన్నారు. ఏ మాత్రం తీరిక లేకుండా ఆయన దేశ విదేశాల్లో పర్యటనలు జరుపుతున్నారు. రీసెంట్ గా దుబాయ్ వెళ్లిన చంద్రబాబు ఆ తర్వాత లండన్ కి వెళ్లారు. ప్రస్తుతం లండన్ లో అమరావతి కొత్త నిర్మాణాలకు సంబందించిన మోడల్స్ కోసం చర్చలు కొనసాగిస్తున్నారు. ఆయనతో పాటు రాజమౌళి కూడా తన ఆలోచనలను అక్కడి అధికారులకు తెలిపినట్లు తెలుస్తోంది అంతే కాకుండా చంద్రబాబు కూడా రాజమౌళి ఆలోచనలు చాలా బాగున్నాయని చెప్పారట.

ముఖ్యంగా రాజమౌళి ప్రతి నిర్మాణం జనాలని ఆకర్షించే విధంగా ఉండాలని చెబుతూ.. అన్ని ప్రాంతాల ప్రజల విశిష్టతను కట్టడాల్లో చూపించాలని చెప్పారు. అదే విధంగా శాతకర్ణి వినియోగించిన జెండాలను కొత్తగా నిర్మించే అసెంబ్లీ కి అన్ని వైపులా ఏర్పాటు చెయ్యాలని చెప్పారు. ఇక వాటిని ప్రజలు కూడా చూసేందుకు కొంచెం ఖాళి స్థలాన్ని ఏర్పాటు చేయాలనీ కూడా రాజమౌళి తన నిర్ణయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అసెంబ్లీ ఆవరణంలో ఒక మంచి కొలను ఏర్పాటు చేసి సూర్యకాంతి నీటిపై పడి ప్రతిబింబించి భవంతిపై పడేలా చేస్తే చూసినవారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని వివరించారు. ఆ విధంగా అసెంబ్లీ ని ఏర్పాటు చెయ్యాలని చెప్పడంతో నార్మన్ పోస్టర్స్ సంస్థ రాజమౌళి ఆలోచనలనలకు అంగీకరించినట్లు తెలుస్తోంది. అదే విధంగా వివిధ రకాల మోడల్స్ గురించి కూడా జక్కన్న వారితో చెప్పారట. చంద్రబాబు కూడా రాజమౌళి చెప్పిన విధంగా చేయాలని వారిని కోరినట్లు తెలుస్తోంది

  •  
  •  
  •  
  •  

Comments