ఆర్ ఆర్ ఆర్ పాత్రలను బయటపెట్టిన రాజమౌళి – తారక్ చరణ్ ఆలా కనిపించబోతున్నారా…?

Thursday, March 14th, 2019, 12:44:03 PM IST

దర్శక ధీరుడు రాజమౌళి తానూ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్… ఎట్టకేలకు ఈ చిత్రానికి సంబందించిన వివరాలను మరియు పాత్రలను వెల్లడించారు రాజమౌళి. నేడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరైన రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, దానయ్య పలు ఆసక్తి కరమైన అంశాలు వెల్లడించారు. సీతారామరాజు యువకుడిగా ఉన్నప్పటి పాత్రను రామ్‌చరణ్‌, కొమురం భీం పాత్రను తారక్‌ చేస్తారు. ‘‘ఇలాంటి కథకు మాకు సహాయపాత్రలు కూడా భారీగానే ఉండాలి. మాకు అంతే భారీ తారాగణం ఉంది. అజయ్‌ దేవగణ్‌ సినిమాకు ఒప్పుకొన్నారు. ఆయనకి కీలక పాత్ర రాసుకొని తనకి మెసేజ్ పెట్టగానే వెంటనే ఒప్పేసుకున్నారు.

ఇక రామ్ చరణ్ కి జోడిగా ఆలియా భట్‌, తారక్ కి జోడిగా డైసీ అడ్గార్జియోన్స్‌ చేస్తున్నారు. సముద్రఖని కూడా ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు… వర్కింగ్‌ టైటిల్‌ ఆర్‌ ఆర్‌ ఆర్‌. కానీ డిస్ట్రిబ్యూటర్స్‌ నుంచి చాలా మంది ‘బాగుంది దాన్నే టైటిల్‌ పెట్టండి’ అంటున్నారు. కానీ ఒక్కో భాషలో ఒక్కో విభిన్న టైటిల్ ఉంటుందని రాజమౌకి వెల్లడించారు. కాగా టైటిల్‌ను మాత్రం ఇప్పుడే చెప్పలేను. అభిమానులనే టైటిల్‌ను గెస్‌ చేయమంటున్నాం. ఇప్పటికైతే టైటిల్‌ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ అనే అనుకుంటున్నాం అని రాజమౌళి అన్నారు.