RRR..అనుకున్నదే జరుగుతుందా..?

Sunday, February 10th, 2019, 02:58:55 AM IST

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో RRR కూడా ఒకటి.యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు ప్రధాన పాత్రదారులుగా రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కితున్నారు.అయితే ఈ సినిమా కథాంశం పట్ల ఆ మధ్య సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి.కానీ ఇప్పుడు అప్పుడు వచ్చిన వార్తలన్నిటిలోను ఒక వార్త చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది.

ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా 1940ల నేపథ్యంలో తెరకెక్కుతుంది అని వార్తలొచ్చాయి.కానీ అప్పుడు అవి ఎప్పటిలానే వచ్చే రూమర్లే అని చాలా మంది అనుకున్నారు.కానీ ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి కొన్ని లొకేషన్ ఫోటోలు బయటకు వచ్చాయి.ఆ ఫొటోల్లో ఉన్నటువంటి సెట్టింగులు అలాగే ఆ సినిమా కోసం పనిచేస్తున్న ఆర్టిస్టుల వస్త్రాధరణ,అలాగే బ్రిటిషు జెండా ఇవన్నీ చూస్తున్నట్టయితే స్వాతంత్ర సమయంలో జరిగిన సంఘటనలు పై చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది.దీనితో మొత్తానికి రాజమౌళి 1940లలో జరిగిన సంఘటనలకు సంబంధించే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని మనం అనుకోవచ్చు.