తుఫాన్ బాదితుల కోసం రాజమౌళి షార్ట్ ఫిల్మ్

Monday, October 20th, 2014, 10:11:22 PM IST


హుధూద్ బాధితులకోసం టాలివుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి షార్ట్ ఫిలింను నిర్మించారు. దీపావళి పండగ సమయంలో ప్రజలు పెట్టె ఖర్చులో సగం హుధూద్ బాధితులకోసం అందజేయాలని రాజమౌళి పేర్కొన్నారు. ఆ ఉద్దేశ్యంతోనే ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందించినట్టు రాజమౌళి తెలియజేశారు. తుఫాన్ బాదితుల కళ్ళలో వెలుగులు నింపడమే షార్ట్ ఫిలిం లక్ష్యమని.. దీనిని చూడటమే కాకుండా అందరు తప్పకుండా బాధితులకోసం సహాయపడాలని రాజమౌళి విజ్ఞప్తి చేశారు. ఈ షార్ట్ ఫిల్మ్ కు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ దర్శకత్వం వహించారు.

 

వీడియో కోసం క్లిక్ చేయండి