బాహుబలి స్టైల్ లో రాజమౌళి ఇంట వివాహం..!

Thursday, December 6th, 2018, 12:39:04 PM IST

దర్శక ధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాతగా అరంగేట్రం చేయబోతున్న విషయం తెలిసిందే, ఇదిలా ఉండగా ఈ డిసెంబర్ 30న కార్తికేయ తన చిన్ననాటి స్నేహితురాలు పూజ ప్రసాద్ ను వివాహం చేసుకోబోతున్నాడు, సెప్టెంబర్ లో వీరికి నిశ్చితార్థం కూడా అయ్యింది. దీంతో ఇటు వృత్తి పరంగా, అటు వ్యక్తిగతంగా జీవితంలో కీలక మైలురాళ్లను ఒకేసారి చేరుకోబోతున్నాడు. రామ్ ప్రసాద్ కూతురైన పూజ, జగపతిబాబు మేనకోడలు కూడా, కాగా వీరి వివాహం బాహుబలి స్టైల్ అట్టహాసంగా జరగనున్నది వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ మధ్య సెలెబ్రిటీలంతా డెస్టినేషన్ వెడ్డింగ్ వైపే మొగ్గు చూపుతున్నారు, నాగ చైతన్య, సమంత కూడా ఈ తరహాలోనే వివాహం చేసుకున్నారు. ఇప్పుడు పూజ, కార్తికేయల వివాహం కూడా తెలుగు రాష్ట్రాల్లో కాకుండా పింక్ సిటీగా పేరు గాంచిన జైపూర్ లో జరగనుందట. అందుకోసం అక్కడ 250ఎకరాల స్థలాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది, అంతే కాదు విలాసవంతమైన 7స్టార్ హోటల్ ఫేర్ మాంట్ ను కూడా బుక్ చేశారట. దీంతో రాజమౌళి కొడుకు వివాహ వేడుక తెలుగునాట ఎవరు జరుపుకొనేంత అట్టహాసంగా జరగనుందన్నమాట. ఆయన సినిమాల్లానే తనయుడి వివాహం కూడా అత్యంత భారీ స్థాయిలో జరుపుతున్నారని అందరూ కొనియాడుతున్నారు.