లక్కుతో వచ్చిన రాజస్థాన్ గెలుస్తుందా?

Monday, May 21st, 2018, 11:10:32 PM IST

ఐపీఎల్ లో లీగ్ మ్యాచ్ లు ఎంతో ఉత్కంఠగా ముగిశాయి. అయితే ఇప్పుడు అందరి చూపి క్వాలిఫైర్స్ పై మళ్లింది. మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ లో హైద్రాబాద్ – చెన్నై తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచినా జట్టు డైరెక్ట్ గా ఫైనల్ కి వెళుతుంది. ఓడిన జట్టుకు ఇంకో అవకాశం ఉంటుంది. రెండవ క్వాలిఫైర్ మ్యాచ్ లో కోల్ కత్తా – రాజస్థాన్ మధ్యన జరగనుంది. ఇందులో గెలిచినా జట్టు మొదటి క్వాలిఫైర్ లో ఒడిన జట్టుతో ఆడాల్సి ఉంటుంది. అది గెలిస్తే గాని ఫైనల్ మ్యాచ్ కు చేరుకోలేదు.

కోల్ కత్తా కొంచెం స్ట్రాంగ్ గానే ఉన్నా కూడా రాజస్థాన్ ఓ విధంగా అదృష్టవ శాత్తు ప్లే ఆఫ్ లోకి వచ్చిందనే చెప్పాలి. వరుస మ్యాచ్ లలో బట్లర్ మంచి ఫామ్ లోకి రావడంతో రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ పై కన్నేసింది. కానీ బట్లర్ స్వదేశీ టూర్ కోసం వెళ్లడంతో ఇప్పుడు మ్యాచ్ లో కీపర్ గా సౌత్ ఆఫ్రికా ఆటగాడు హెన్రిక్ క్లాస్సేన్ చేరాడు. కెప్టెన్ అజింక్యా రహానే స్పీడ్ గా అడగలిగితే స్కోర్ పెరుగుతుంది. అలాగే ఎన్నో ఆశలు పెట్టుకున్న స్టోక్స్ కూడా ఇంకా పూర్తిగా ఫామ్ లోకి రాలేదు. బ్యాటింగ్ లో అతని స్థాయికి తగ్గటుగా రాణించడం లేదు. బౌలర్లు కూడా బలంగా మారాలి. కోల్ కత్తా జట్టు చాలా స్ట్రాంగ్ గా ఉంది. లీగ్ మ్యాచ్ లో రెండు సార్లు కోల్ కత్తా రాజస్థాన్ ను ఓడించింది. ఆ ఓటముల నుంచి రహానే సేన పాటలు నేర్చుకొని సరికొత్త ప్రణాళికలతో సిద్దమయితేనే ఐపీఎల్ ఫైనల్ బరిలో నిలుస్తుంది. చూడాలి మరి జట్టు ఎంతవరకు రాణిస్తుందో..?

  •  
  •  
  •  
  •  

Comments