మొదటి విజయం రాయల్స్‌దే

Thursday, April 12th, 2018, 04:25:42 AM IST


ఇరు జట్లకు మొదటి గెలుపు కావలి అనే సమయంలో పోరాటం ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. పోరాటంలో ఏ మాత్రం అలసత్వం కనిపించదు. బుధవారం జరిగిన రాజస్థాన్ రాయల్స్ – ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్ల మధ్య అదే కసి కనిపించింది. ఫైనల్ గా రాజస్థాన్ అదృష్టవ శాత్తు వర్షం కారణంగా డక్ వర్త్ లూయిస్ ప్రకారం 10 పరుగులతో విజయం సాధించింది. జై పుర్ లో జరిగిన ఈ మ్యాచ్ కి వర్షం అంతరాయం కలిగించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ కొంచెం తడబడుతూనే ఆటను కొనసాగించింది.

అజింక్యా రహానే (45) సంజు శాంసన్(37) అలాగే బట్లర్(29) రాణించడంతో 17.5 ఓవర్లకు స్కోరు 153కు చేరింది. అదరగొడతాడు అనుకున్న బెన్ స్టోక్స్ ఈ సారి కూడా నిరాశపరిచాడు. ఇక రెండే ఓవర్లు మిగిలి ఉండగా మొదట ఇన్నింగ్స్ కు వరణుడు అడ్డు పడ్డాడు. చివరికి లెట్ అవ్వడంతో ఓవర్లు తగ్గిపోయాయి. డిఎల్ఎస్ రూల్ ప్రకారం 6 ఓవర్లకు ఢిల్లీ టార్గెట్ ను 71 పరుగుల కుదించడం జరిగింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ అనుకున్నంత రేంజ్ లో ప్రదర్శనను కనబర్చలేకపోయింది. మాక్స్ వెల్ లాంటి ఆటగాడు ఓపెనర్ గా వచ్చినప్పటికీ 17 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. మున్రో ఒక్క బంతిని ఎదుర్కొకుండానే రనౌట్ అయ్యాడు. ఆ తరువాత రిషబ్ పంత్ (17) క్రిస్ మోరిస్ (21) స్పీడ్ గా ఆడడానికి ప్రయత్నించినప్పటికీ రాజస్థాన్ బౌలర్లు సమర్ధవంతంగా వారి బాధ్యతను నిర్వహించారు. చివరికి 10 పరుగుల తేడాతో రాజస్థాన్ ఐపీఎల్ 2018లో మొదటి విజయాన్ని అందుకుంది.