ఐపీఎల్ వేలంలో సంచలనం : రూ 11.50 కోట్లకు రాజస్థాన్ సొంతమైన ఉనద్కత్..!

Sunday, January 28th, 2018, 12:41:30 PM IST

ఇండియన్ క్రికెటర్ ఉనద్కత్ కు ఇది మైండ్ బ్లోయింగ్ ఆఫర్. కలలోసైతం ఊహించని విధంగా ఈ లెఫ్ట్ ఆర్మ్ ఫేసర్ ని రాజస్థాన్ రూ 11.50 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. ఈ ఐపీఎల్ లో అత్యధిక ధర పలికిన ఇండియన్ ప్లేయర్ ఇతడే. మొత్తంగా అత్యధిక ధర పలికిన రెండవ అతగాడు. నిన్నటి వేలంలో బెన్ స్ట్రోక్స్ 12.50 కోట్ల ధర పలికిన సంగతి తెలిసిందే.

ఉనద్కత్ ని దక్కించుకునేందుకు ప్రాంచైజీలన్నీ పోటీ పడ్డాయి. చివరకు రాజస్థాన్ ఇతడిని లాగేసుకుంది. టి 20ల్లో ఉనద్కత్ కు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ప్రస్తుతం బౌలింగ్ విభాగంలో వరుసగా వేలం కొనసాగుతోంది. గత ఏడాది ఉనద్కత్ పూణే తరుపున ఆడి తన ప్రతిభని చాటుకున్నాడు.