అశ్విన్ గ్యాంగ్ పై రహానే సేన రివేంజ్!

Wednesday, May 9th, 2018, 01:37:23 AM IST

ఎట్టకేలకు వరుసగా మూడు పరాజయాల తరువాత రాజస్థాన్ గెలిచింది. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 15 పరుగులతో విజయాన్ని అందుకోనిక్ ప్లే ఆఫ్ స్థానం కొరుకు ఆశలను నిలుపుకుంది. మొన్న పంజాబ్ తో మొదటి మ్యాచ్ లో ఓడిన రహానే సేన నేటి మ్యాచ్ లో మాత్రం అశ్విన్ గ్యాంగ్ పై రివెంజ్ తీర్చుకుంది. రాజస్థాన్ గెలుపుపై పంజాబ్ ఆటగాడు లోకేష్ రాహుల్ (95) ఒంటరి పోరాటం చేసి అనుమానాలు రేపాడు. కానీ బౌలర్లు సమిష్ట కృషితో రాణించడంతో రాజస్థాన్ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ చాలా వరకు బౌలింగ్ లో మెరుగుపడిందని చెప్పాలి.

కృష్ణప్ప గౌతమ్ మొదట్లోనే గేల్ – అశ్విన్ లను పెవిలియన్ కు పంపి పంజాబ్ పై ఒత్తిడి పెంచాడు. ఆ తరువాత మిగతా బౌలర్లు అందరూ చెరొక వికెట్ తీయడంతో 159 పరుగుల లక్ష్యాన్ని అందుకోవాల్సిన పంజాబ్ కేవలం 143 పరుగులు మాత్రమే చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ మొదట్లోనే పరుగులను గట్టిగా రాబట్టింది. బట్లర్ 82(58) పరుగులు చేయడంతో జట్టు ఆ స్కోర్ అందుకుంది. కానీ ఆ తరువాత వచ్చిన బ్యాట్స్ మేన్స్ ఎవరు పెద్దగా ఆకట్టుకోలేదు. సంజూ శాంసన్‌(22), స్టోక్స్‌(14), స్టువర్ట్‌ బిన్నీ(11)లు అనుకున్నంతగా రాణించకపోవడంతో జట్టు భారీ టార్గెట్ ను ఇవ్వలేకపోయింది. పంజాబ్ బౌలర్ ఆండ్రూ టై 4 వికెట్లు తీసి మంచి ప్రతిభని కనబరిచాడు. ఈ గెలుపుతో పంజాబ్ 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ముంబై తో సమానంగా నిలిచింది. నెక్స్ట్ జరగబోయే మ్యాచ్ లలో గెలిస్తే ప్లే ఆఫ్ కి చేరుకునే అవకాశం దక్కుతుంది. మరి రహానే సేన ఎంతవరకు రానిస్తుందో చూడాలి.

Comments