రజినీ కాంత్ బలం మాములుగా లేదు.. నెక్స్ట్ ఎలక్షన్స్ లో విజయం ఆయనదేనా?

Wednesday, January 3rd, 2018, 04:24:19 PM IST

ఫైనల్ గా రాజకీయాల్లోకి రావడానికి రజినీకాంత్ ఒక అడుగు ముందుకు వేశారు. గత కొంత కాలంగా పాలిటిక్స్ లోకి రావాలా వద్దా అనే ఆలోచనతో సతమతమైన కోలీవుడ్ సూపర్ స్టార్ జనాలకు మంచి చేయాలనీ డిసైడ్ అయ్యారు. అందుకు ఎవరు ఊహించని విధంగా రజినీకాంత్ కొత్త ఆలోచనతో ముందుకు వెళుతున్నాడు. రీసెంట్ గా ఓ వెబ్ సైట్ ద్వారా సభ్యత్వం నమోదు చేసుకోవాలని చెప్పగా లక్షల్లో జనాలు రజినీకాంత్ కు మద్దతుగా నిలిచారు. 24 గంటల్లోనే 5 లక్షల మంది ఓటర్ కార్డు ఆధార్ కార్డు జతచేసి పార్టీలో జాయిన్ అవుతున్నట్టుగా తెలిపారు.

దీంతో ఒక్కసారిగా రాజకీయ ప్రముఖులు ఆ లెక్కలను చూసి షాక్ అయ్యారు. రజినీ లెట్ గా వచ్చినా ఆయనకు ముందుగా మద్దతు ఇవ్వడానికి జనాలు ఆసక్తిని కనబరుస్తున్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక మీడియాలలో కూడా రజినీ ఫాలోవర్స్ సంఖ్య గురించి చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు ఏ ప్రముఖ వ్యక్తికి ఈ తరహాలో ఫాలోవర్స్ సపోర్ట్ చేయలేదని అక్కడ కథనాలు వెలువడుతున్నాయి. ఇంకా పార్టీ పేరు కూడా పెట్టని రజినీ రాజకీయాల్లోకి మొత్తంగా అడుగుపెడితే అన్ని పార్టీలు గంగలో కొట్టుకుపోవాల్సిందే అని ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.