బాలచందర్ ను పరామర్శించిన రజనీ, ఖుష్బూ!

Monday, December 15th, 2014, 08:08:42 PM IST

balachandar
ప్రముఖ దర్శకుడు కె బాలచందర్ తీవ్ర అస్వస్థతకు గురై చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు ఒక బులిటెన్ ను విడుదల చేశారు. అలాగే బాలచందర్ చికిత్సకు స్పందిస్తున్నారని క్రమంగా ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని వైద్యులు పేర్కొన్నారు. ఇక బాలచంద్ ను ప్రముఖ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, కాంగ్రెస్ నాయకురాలు, ప్రముఖ నటి ఖుష్బూ కావేరీ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఖుష్బు మాట్లాడుతూ ఆయన ఆరోగ్యం బాగానే ఉందని దానిపై ఎవరు ఎలాంటి వదంతులు సృష్టించవద్దని విజ్ఞ్యప్తి చేశారు.