వీడియో: తూత్తుకుడి ఘటనపై రజినీకాంత్ ఆవేదన!

Wednesday, May 23rd, 2018, 11:45:40 PM IST

తమిళనాడులోని తూత్తుకుడిలో స్టెరిలైట్‌ కాపర్‌ తయారీ ప్లాంటు కు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కాలుష్యం కారణంగా రోగాల బారిన పడుతున్నారని ఇటీవల భారీ స్థాయిలో నిరసనకు దిగారు. అయితే ఆ నిరసనలో 12 మంది మరణించగా దాదాపు 100 మందికి పైగా గాయపడ్డారు. పోలీసులు జరిపిన కాల్పులపై ప్రస్తుతం ప్రతి పక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది అధికార పార్టీ కుట్ర అని అమాయక జనాల ప్రాణాలు కోల్పోయేలా చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం పరిస్థితీ అదుపులోకి రాకపోవడంతో ప్రాంతం మొత్తం 144 సెక్షన్ ను విధించారు.

ఇక ఘటనపై సూపర్ స్టార్ రజినీకాంత్ స్పందించారు. 12 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పోలీసు బలగాలు దారుణంగా వ్యవహరించారు. ఇంటెలిజెన్స్‌‌ డిపార్ట్‌మెంట్‌ను సర్కారు దుర్వినియోగం చేసింది. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు రజినీకాంత్ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. అదే విధంగా ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సబ్యులకు రజినీ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అయితే అధికార ప్రభుత్వం పై వస్తున్న ఆరోపణలకు ముఖ్య నేతలు పెద్దగా స్పందించకపోవడం గమనార్హం.

  •  
  •  
  •  
  •  

Comments