హుధుద్ కోసం రజనీకాంత్ 5లక్షల విరాళం!

Saturday, December 20th, 2014, 09:39:25 PM IST

rajini-kanth
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఉత్తరాంధ్రను కుదిపేసిన హుధుద్ తుఫాను బాధితుల సహాయార్ధం 5లక్షల విరాళాన్ని అందించారు. ఈ మేరకు ఆయన నిర్వహిస్తున్న శ్రీ రాఘవేంద్ర పబ్లిక్ చారిటబుల్ ట్రస్టు తరపున ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధికి రజనీ చెక్కును అందజేశారు. కాగా హుధుద్ కోసం టాలీవుడ్ పరిశ్రమ నిర్వహించిన ‘మేము సైతం’ కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని హైదరాబాద్ లో నిర్వహించిన లింగా సక్సెస్ మీట్ రజనీ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే అదే సమయంలో త్వరలో తన వంతు సహాయాన్ని అందిస్తానని చెప్పిన రజనీ అన్న ప్రకారం తన మాటను నిలబెట్టుకున్నారు.