బిజెపిపై విమర్శలు గుప్పించిన తలైవా ‘రజినికాంత్’

Sunday, May 20th, 2018, 08:20:29 PM IST

సూపర్ స్టార్ రజిని కాంత్ ఒకవైపు తాను నటిస్తున్న చిత్రాలతోను, మరోవైపు త్వరలో నెలకొల్పబోయే రాజకీయ పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. ఇటీవల హిమాలయాలకు వెళ్లి వచ్చిన ఆయన తన మనుమడి పుట్టినరోజుని కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా నేడు ఆయన చెన్నైలోని రజిని మక్కల్ మండ్రం మహిళా వైభంగా నేతలతో పలు అంశాలు, సమస్యలపై చేర్చించారు. అయితే ఆ సమావేశం అనంతరం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ కర్ణాటకలో బిజెపి ఎత్తులు పారలేదని, ప్రజాస్వామ్యాన్ని పరిహసించాలని చూస్తే చివరకు నష్టపోయేది తామే అని వారికి తెలిసివచ్చింది విమర్శించారు. ఓ వైపు జెడిఎస్ సహా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు చేయదలచినపుడు గవర్నర్ పూర్తి ప్రభుత్వ ఏర్పాటు అభ్యర్థులు లేని బిజెపి కి అవకాశం ఇచ్చారని, అది కూడా యడ్యూరప్పకు బల నిరూపణకు 15 రోజుల అవకాశం ఇవ్వడం తగదని అన్నారు.

అయినా కానీ చివరికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీమ్ కోర్ట్ న్యాయాన్ని గెలిపించి ప్రజల పక్షాన నిలిచిందని అన్నారు. అయితే తన పార్టీ ప్రకటన ఎప్పుడు ఉంటుంది అనే దానిపై రజిని స్పష్టత ఇవ్వలేదు. అలానే పార్టీ విధివిధానాలు, మేనిఫెస్టో తదితరాలన్నీ కూడా పార్టీ పేరు, గుర్తు ప్రకటన తర్వాతే ఉంటాయి అని తెలిపారు. ప్రభుత్వం త్వరలో ఎన్నికల తేదీలను ప్రకటించగానే అప్పుడు పార్టీలో పొత్తులు గురించి ఆలోచిస్తామని, ఎన్ని చోట్ల పోటీ చేయాలి అనేదానిపై ఇంకా స్పష్టత రావలసి ఉందని, అన్నిటికి కొంచెం సమయం పడుతుందని అన్నారు. కొద్దిరోజులు వేచి చూస్తే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని అన్నారు. కమల్ పార్టీ ఇటీవల ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి తాను వెళ్లలేక పోవడానికి కారణం తాను ఇంకా పార్టీ ఏర్పాటు చేయకపోవడమేనన్నారు. మా పార్టీ ఏర్పాటు తర్వాత కమల్ నిర్వహించే అయన పార్టీ సమావేశాలకు తప్పక హాజరవుతానని అన్నారు……

  •  
  •  
  •  
  •  

Comments