రజినీకాంత్ సినిమాకు జోష్ తగ్గింది.. హిట్టవుతుందా?

Wednesday, June 6th, 2018, 12:51:34 PM IST

కోలీవుడ్ సూపర్ స్టార్ రాజినీకాంత్ సినిమా వస్తోంది అంటే చాలు మిగతా హీరోలు కూడా పక్కకు తప్పుకుంటారు. అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ఫ్యాన్స్ చూపు రజినీ సినిమా వైపే ఉంటుంది. గతంలో చాలా సినిమాలు అందుకు ఉదాహరణంగా నిలిచాయి. ముఖ్యంగా రోబో సినిమా తరువాత ఆ డోస్ కాస్త ఎక్కువయిందని చెప్పాలి. తెలుగులో కూడా ఆ సినిమా రజినీకాంత్ కు డబుల్ క్రేజ్ ను తెచ్చిపెట్టింది.

రోబో తరువాత లింగా – కబాలి సినిమాలు విడుదల అయ్యాయి. ఆ సినిమాలకు అందిన క్రేజ్ అంతా ఇంతా కాదు. రిలీజ్ తరువాత రిజల్ట్ అనేది తరువాత సంగతి. కానీ విడుదలకు ముందు సినిమా ఏ స్థాయిలో క్రేజ్ అందుకున్నది అనేది ముఖ్యం. మెయిన్ గా కబాలి సినిమాకు అయితే వరల్డ్ వైడ్ గా రజినిఫ్యాన్స్ ను ఆకర్షించింది. కొన్ని దేశాల్లో అయితే రజినీకాంత్ ఫ్యాన్స్ కోసమని విడుదల రోజు సెలవులు కూడా ఇచ్చేశారు.

అంతలా కబాలి సినిమాకు క్రేజ్ అందింది. అయితే ఓపెనింగ్స్ ను గట్టిగానే అందుకున్నప్పటికీ సినిమా మాత్రం విమర్శలను అందుకుంది. అయితే ఆ సినిమా ప్రభావం వల్ల ఇప్పుడు కాలా కు పెద్దగా క్రేజ్ రావడం లేదు. కబాలి దర్శకుడు పా.రంజిత్ ఈ సినిమాను తెరకెక్కించడం వల్ల అభిమానులు పెద్దగా ఆశలు పెంచుకోలేదు. బజ్ పెద్దగా లేకపోవడంతో ఓపెనింగ్స్ నార్మల్ గానే ఉంటాయని టాక్ వస్తోంది. అలాగే ట్రైలర్ టీజర్ సాంగ్స్ కి అనుకున్నంత రెస్పాన్స్ రావడం లేదు. అలాగే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పెద్దగా నమోదు కాలేదు. మరి ఈ నార్మల్ క్రేజ్ మధ్యలో కాలా ఏ స్థాయిలో కలెక్షన్స్ ను అందుకుంటుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments