నువ్వు ఎవరని రజినీకాంత్ ను ప్రశ్నించిన యువకుడు!

Thursday, May 31st, 2018, 10:41:23 AM IST

ఇండియాలో ఒక భాషకు చెందిన హీరోలను పరభాషా స్టార్ హీరోలను పెద్దగా గుర్తు పట్టకపోవచ్చు. కానీ కోలీవుడ్ సూపర్ స్టార్ ని మాత్రం ఏ భాషలోని అభిమానులైన సరే ఇట్టే గుర్తు పట్టేస్తారు. రజినీ కాంత్ కు దేశమంతటా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అందరికి తెలిసిందే. ఎక్కడికెళ్లినా కూడా సినీ అభిమానులు ఆయనని గుర్తు పట్టేస్తారు. పైగా రజినీకాంత్ బయట సాధారణంగా కనిపిస్తారు. అసలు విషయంలోకి వస్తే.. ఇటీవల ఓ యువకుడు రజినీకాంత్ ముందుకు వస్తే ఎవరు అని అడగడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తలైవా గురించి తెలియని వారు ఉండరు. అలాంటిది ఆయనను ఎవరని అడిగిన మహానుభావుడు ఎవరని కామెంట్స్ చేస్తున్నారు. అది కూడా తమిళనాడు వ్యక్తి ఆ తరహాలో ప్రశ్నించడం గమనార్హం. రీసెంట్ గా తూత్తుకుడిలో స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ మూసివేయాలని చేసిన ఆందోళనలో గాయపడిన వారిని సూపర్ స్టార్ పరామర్శించేందుకు వెళ్లారు. తూత్తుక్కుడి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కి రజిని రాగానే జనాలు ఒక్కసారిగా ఎగబడ్డారు. అయితే ఇంతలో సంతోష్ రాజ్ అనే 21 ఏళ్ల కుర్రాడు రజినీని చూసి మీరు ఎవరని అడగడం ఆశ్చర్యాన్ని కలిగించింది. స్టెరిలైట్ కు వ్యతిరేకంగా పోరాటం చేసిన కాలేజ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ సృష్టికర్త సంతోష్. నిరసనలో అయన తలకు బలంగా గాయాలయ్యాయి. అయితే పరామర్శించడానికి వచ్చిన నాయకులందరిని సంతోష్ ఎవరనే అడుగుతున్నట్లు చెబుతున్నారు. ఇక అతను అడిగిన ప్రశ్నకు రజినీకాంత్ మాత్రం చాలా సింపుల్ గా నవ్వుతూ వెళ్ళిపోయాడు.