రజినీకి మత పిచ్చి.. ఆ పనిచేస్తే బెటర్ అన్న కమల్..!

Monday, September 25th, 2017, 01:57:56 PM IST


అరవ రాజకీయాల్లో సినీ తరాల వేడి పెరుగుతోంది. కమల్, రజిని మధ్య ఈ పాలిటిక్స్ ఏవైనా చిక్కులు తెచ్చిపెడతాయా అనే సందేహం కలుగక మానదు. ఇటీవల జాతీయ మీడియాతో జరిగిన ఇంటర్వ్యూ లో కమల్ హాసన్ మాట్లాడుతూ రజినీకాంత్ కు మత పరమైన విశ్వాసాలు ఎక్కువని అన్నారు. తాను హేతువాదిని అని కమల్ తెలిపారు.

రజినీకాంత్ కు ఉన్న భావజాలం ప్రకారం ఆయన బిజెపిలో చేరితే మంచిదనే సూచన చేయడం విశేషం. తాను రజినీకి క్లోజ్ ఫ్రెండ్ ని అన్నారు. తరచుగా ఆయనతో మాట్లాడుతుంటాను కాబట్టి రజినీకి మత పరమైన విశ్వాసాలు ఎక్కువనే విషయం తెలిసిందని కమల్ వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న విషయాన్ని రజినీకి చెప్పానని అన్నారు. ఈ ఏడాది చివరికల్లా పార్టీని స్థాపిస్తానని కమల్ ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేనంతగా తమిళ రాజకీయాల్లో గడ్డు పరిస్థితి నెలకొని ఉందని కమల్ అభిప్రాయ పడ్డారు.

  •  
  •  
  •  
  •  

Comments