అమ్మో.. రజినీ తక్కువేం కాదు.. పాలిటిక్స్ బ్రెయినే!

Thursday, March 8th, 2018, 03:50:24 AM IST

తమిళనాడులో రాజకీయ రంగాల్లో అసలైన వేడి మొదలైంది. చిన్నా చితకా పార్టీలు వచ్చే ఎలక్షన్స్ కనిపించడం కష్టమే. ప్రస్తుతం అధికారంలో ఉన్న నాయకులు కూడా వచ్చే ఎలక్షన్స్ లో ప్యాకప్ చెప్పాల్సిందే. ఎందుకంటే కమల్ హాసన్ – రజినీకాంత్ మధ్య హోరా హోరి పోటీకి ఇతరులు నిలబడటం కష్టం. అక్కడి జనాలు సినిమా హీరోలను ఎక్కువగా ఇష్టపడతారు అని గతంలో చాలా సార్లు నిరూపించారు. అయితే ప్రస్తుతం అన్నాడీఎంకే లో వివాదాలు జనాలకు విసుగు తెప్పించాయి.
దీంతో రజినీకాంత్ కమల్ రంగంలోకి దిగారు. కమల్ ఇప్పటికే పార్టీని స్థాపించి జనాల్లోకి వెళ్లడానికి సిద్దమయ్యాడు. ఇక రజినీకాంత్ అయితే సరికొత్త తరహాలో ప్రచారాలను సాగిస్తున్నాడు.

తలైవా అభిమానుల సంఖ్య కోలీవుడ్ లో చాలానే ఉంది. అయితే రజినీ ఏ మాత్రం తగ్గకుండా ఇప్పటినుంచే అన్ని వైపులా జనాలను ఆకర్షిస్తున్నాడు. ఇప్పటికే ఇంటర్నెట్ ప్రపంచంలో తన వెబ్ సైట్ ద్వారా పార్టీ సభ్యత్వ నమోదు ఏర్పాటు చేశాడు. ఇక రీసెంట్ గా సోషల్ మీడియా ద్వారా కూడా సూపర్ స్టార్ యువతనూ ఆకర్షించే పనిలో పడ్డాడు. ట్విట్టర్ అకౌంట్ లో ఉన్న రజిని ఇన్స్టాగ్రామ్ ఫెస్ బుక్ అకౌంట్ లను కూడా ఓపెన్ చేశాడు. వణక్కం (నమస్కారం) అంటూ ఫేస్‌బుక్‌లో ఫస్ట్ పోస్ట్ చేయగా.. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో మాత్రం ‘హలో నేను ఇక్కడున్నా… అందరికీ చెప్పండి’ అంటూ కామెంటే చేశాడు. దీంతో ఫాలోవర్స్ సంఖ్య చాలా పెరిగిపోతోంది. ట్విట్టర్ లో ఇప్పటికే రజినీకి నాలుగున్నర మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.