పాలిటిక్స్ మొదలెట్టిన సూపర్ స్టార్!

Wednesday, May 30th, 2018, 12:58:15 PM IST

కోలీవుడ్ సూపర్ స్టార్ రాజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పాడు. కానీ ఇంకా అసలైన కార్యాచరణను మొదలు పెట్టలేదు. జనాలను ఆకర్షించాలి అంటే వారి మధ్యలోకి వెళ్లాలి. ఆ విధంగా వెళ్లడం తలైవాకు సాధ్యం కానీది. కానీ ఎలా స్టార్ట్ చేస్తారు అనేది అందరిలోను ఆసక్తికరంగా మారింది. అయితే రీసెంట్ గా రజినీ కాంత్ ఓ సరైన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి జనాలను దగ్గరగా వెళ్లాలని తన అసలైన సరికొత్త పాలిటిక్స్ ను మొదలు పెట్టబోతున్నారు. ముందుగా ఇటీవల జరిగిన తూత్తుక్కుడి(ట్యూటీకోరిన్‌)లో స్టెరిలైట్‌ బాధితుల పక్షాన నిలబడాలని రజినీ డిసైడ్ అయ్యారు.

వారిని కలిసి పరామర్శించేందుకు సిద్దమైనట్లు తెలిపారు. అందుకోసం తన లేటెస్ట్ మూవీ కాలా ప్రమోషన్స్ కి కూడా సూపర్ స్టార్ బ్రేక్ ఇచ్చారు. ఇక రజినీకాంత్ మాత్రం భవిష్యత్ లో పోరాటాలకు అమాయకుల ప్రాణాలు బలి కావద్దని రక్తాన్ని చిందించే పోరాటాలు ఉండకూడదని
తెలిపారు. స్టెరిలైట్‌ పరిశ్రమను మూసెయ్యాలని కొన్ని రోజుల క్రితం జరిగిన ఆందోళనలో పోలీసుల కాల్పుల వలన 13 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఘటన తరువాత అసెంబ్లీలో ప్రతి పక్షాలు నిరసన వ్యక్తం చేయడంతో స్టెరిలైట్‌ పరిశ్రమ మూత పడింది. ఇక రజినీ ఇప్పుడు బాధితులను పరామర్శించడానికి వెళుతుండడంతో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments