దేశ హోమ్ మంత్రికే మార్ఫింగ్ సెగ..ఫోటోని ఏం చేశారో తెలుసా..!

Thursday, November 2nd, 2017, 03:33:14 AM IST

మార్ఫింగ్ నుంచి తప్పించుకోవటం ఈ రోజుల్లో ఏ ఒక్క సెలెబ్రిటి సాధ్యం కాదేమో. అజ్ఞాత వ్యక్తులు చేసే మార్ఫింగ్ వలన కొన్ని సార్లు సెలెబ్రిటీల ప్రతిష్ఠకే భంగం కలిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితి నుంచి సాక్షాత్త మనదేశ హోమ్ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగే తప్పించుకోలేక పోయారు. ఓ మార్ఫింగ్ ఫొటోలో ఉన్నది రాజ్ నాథ్ సింగ్ అని భ్రమ పడిన కొందరు ఆయన పై విమర్శలు గుప్పించారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజ్ నాథ్ పై విమర్శలు పెరిగాయి.

చివరకు ఫోటో సంగతి నిగ్గుతేలిస్తే అసలు నిజం బయట పడింది. రాహుల్ గాంధీ ప్రొఫైల్ పిక్ పెట్టుకుని ఉన్న రిజ్వి అనే వ్యక్తి ఈ ఫోటోని సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. గుజరాత్ డిజిపి రాజ్ నాథ్ కళ్ళు పట్టుకుంటున్నట్లు అందులో ఉంది. దీనిని చూసాక ఎన్నికలు సామరస్యంగా జరుగుతాయనే నమ్మకం నాలో లేదు. ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదు అంటూ అతడు ట్వీట్ చేశాడు. నిజంగా రాజ్ నాథ్ సింగే అనుకుని పొరపాటు పడిన కొందరు ఆయనపై విమర్శలు చేస్తూ కామెంట్లు పెట్టారు. విచారణ జరిపాక ఆ ఫోటో ‘క్యాయో సచ్ హై’ అనే చిత్రంలోనిదని తేలింది. ఆ ఫొటోలో సోఫాలో కూర్చుని ఉన్న వ్యక్తి ముఖం స్థానంలో రాజ్ నాథ్ ముఖాన్ని మార్ఫింగ్ చేశారు. దీనితో రాజ్ నాథ్ మద్దత్తు దారులు ట్వీట్ చేసిన వ్యక్తి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments