ఇది రూమ‌ర్ కాదు.. త్వ‌ర‌లోనే ర‌కుల్ పెళ్లి..?

Wednesday, November 21st, 2018, 03:30:40 PM IST

బాలీవుడ్ నుండి టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ర‌కుల్ ప్రీత్ సింగ్ త‌క్కువ కాలంలోనే స్టార్ హీరోల‌తో న‌టించి ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోయింది. అయితే ఆ త‌ర్వాత ర‌కుల్ న‌టించిన తెలుగు సినిమాలు పెద్ద‌గా ఆడ‌క‌పోవ‌డంతో ర‌కుల్‌కి ఐరెన్ లెగ్ ముద్ర వేసి ప‌క్క‌న‌పెట్టేశారు టాలీవుడ్ ద‌ర్శ‌క. నిర్మాత‌లు. దీంతో చెన్నై చెక్కేసిన ర‌కుల్ కోలీవుడ్‌లో రెండు మూడు చిత్రాల్లో న‌టిస్తోంది. ఇక కార్తీతో న‌టించి ఖాకీ చిత్రం ఇప్ప‌టికే విడుద‌లై ప‌ర్వాలేద‌నిపించ‌గా, అత‌నితోనే దేవ్ చిత్రంలో న‌టింస్తోంది. ఇక సూర్య‌తో కూడా జ‌త‌క‌ట్టిన ఈ భామ ఇటీవ‌ల బాలీవుడ్‌లో మ‌రో ఆఫ‌ర్ కొట్టేసింది.

ఇక అసలు మ్యాట‌ర్ ఏంటంటే తాజాగా సోష‌ల్ మీడియాలో ర‌కుల్ పెళ్లి పై రూమ‌ర్లు స్ప్రెడ్ అవుతున్నాయి. ప్ర‌స్తుతం కెరీర్ పై ఫోక‌స్ పెట్టి సినిమాల‌తో బిజీగా గ‌డుపుతున్న ర‌కుల్.. వ‌య‌సు అయిపోతుంద‌ని త్వ‌ర‌లో పెళ్లి చేసుకుంటే మంచిద‌ని ఆమె త‌ల్లి ఫోర్స్ చేస్తోంద‌ట‌. ర‌కుల్‌కు పెళ్లి చేయాల‌ని ఆమె త‌ల్లి,దండ్రులు నిశ్చ‌యించుకున్నార‌ని.. ఈ క్ర‌మంలో ర‌కుల్ కుంటుంబ స‌భ్యులు పెళ్లి కొడుకుని వెదికే ప‌నిలో ఉన్నార‌నే టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే ఈ వార్త ర‌కుల్ ద‌గ్గ‌ర‌కు వెళ్ళ‌డంతో త‌న పెళ్లి గురించి కుటుంబ‌స‌భ్య‌లు తొంద‌ర‌ప‌డుతోంది నిజ‌మే అని.. నాకు కూడా పెళ్లి చేసుకోవాల‌ని ఉంద‌ని మంచి అబ్బాయిని చూడ‌మ‌ని త‌న స్నేహితుల‌కి కూడా చెప్పాన‌ని ర‌కుల్ చెప్పిన‌ట్టు స‌మాచారం. దీంతో త్వ‌ర‌లోనే ర‌కుల్ పెళ్లి చేసుకునే అవ‌కాశాలు ఉన్నాయిని సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు నెటిజ‌న్లు.